విశాఖ

ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(టౌన్) ఫిబ్రవరి 23: రైతులు వరి సాగులో ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ పీడీ కె.సీహెచ్ అప్పలస్వామి రైతులకు సూచించారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు- సైంటిస్టులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాస్తవ్రేత్తలు ఇచ్చిన సూచించిన విధానంలో వరి సాగు చేసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలన్నారు. వరిసాగులో నైపుణ్యం కనబర్చే రైతులు, వ్యవసాయ శాస్తవ్రేత్తలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 58లక్షలు నిధులు మంజూరు కాగా 40క్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రైతు శిక్షణా తరగతులు, విజ్ఞాన యాత్రలు చేపట్టామన్నారు. మార్చి 13న ఢిల్లీలో జరిగే భారతీయ విజ్ఞాన వికాస్ సదస్సుకు జిల్లా నుండి 20 మంది రైతులను తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు. అక్కడ జాతీయ కిసాన్ మేళా జరుగుతుందని, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏరువాక శాస్తవ్రేత తేజశ్వరావు, సహాయసంచాలకులు మోహనరావు, ఏవోలు ఝాన్సీలక్ష్మీ, విజేత, మధు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసం పట్టుదలతో చదివితే మంచి భవిష్యత్
కోటవురట్ల, ఫిబ్రవరి 23: క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని కె.జి.హెచ్. ఆర్. ఎం. ఓ, డీబీ ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మెన్ డాక్టర్ పి.బంగారయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పరీక్షల్లో రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ బంగారయ్య అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలకు వెళ్ళే విద్యార్ధులు వత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా చదువుపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులు ముందుగా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రణాళికా బద్దంగా చదివితే విజయం వరిస్తుందన్నారు. విద్యార్థులు వారి అభిరుచికి తగిన కోర్సులనే ఎంపిక చేసుకోవాలన్నారు. విద్య పేదరికాన్ని జయిస్తుందన్నారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యనభ్యశించిన వారే అన్న విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదన్నారు.