విశాఖ

ప్రత్యేక హోదాపై విద్యార్థులకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఫిబ్రవరి 23: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే అంశంపై వైసీపీ శుక్రవారం అవగాహన కల్పించింది. వైసీపీ అధిష్టానం సూచనల మేరకు నియోజకవర్గం సమన్వయకర్త చెట్టి ఫల్గుణ తమ నాయకులతో కలిసి విద్యార్థులకు ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. విభజనతో కుదేలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే జవ జీవాలు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, విభజనకు గురైన రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న తమ పార్టీకి మద్దతు పలికి పోరాటంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌తో పాటు విభజన చట్టంలో లేనివి కూడా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాన మంత్రి మోది హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు కావచ్చినా ఇంతవరకు అమలు చేయలేదన్న విషయాన్ని విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రానున్న కాలంలో చేపట్టనున్న కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని ఫల్గుణ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అశోక్, ఆనంద్, పాపారావు, కొండలరావు, గాసి, డిగ్రీ కళాశాల విద్యార్థి సంఘం నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేడు సమగ్ర భారీ మంచి నీటి పథకంపై అవగాహన సదస్సు
* మున్సిపల్ కమిషనర్ సురేంద్ర
నర్సీపట్నం(టౌన్), ఫిబ్రవరి 23: సమగ్ర భారీ మంచి నీటి పథకంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ సరేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 130 కోట్ల రూపాపాయలతో చేపడుతున్న మంచి నీటి పథకంపై అవగాహన సదస్సు శనివారం మధ్మాహ్నం 12గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కౌన్సిలర్లుతో పాటు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వం గ్రూప్ హౌస్ నిర్మాణాల పై ఎక్కువ దృష్టి పెట్టిందని తెలిపారు. శంకుస్థాపన చేసిన తర్వాత పనులు మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చినెలకు లబ్ధిదారులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. మంత్రి అయ్యన్నపాత్రుడు కోరిక మేరకు మున్సిపాలిటీకి అదనంగా మరో 2కోట్లు మంజూరు చేస్తున్నట్టు మున్సిపల్ శాఖా మంత్రి ప్రకటించారని వెల్లడించారు. ఇచ్చిన నిధులు ఆగష్టు నెలాఖరుకు ఖర్చు చేస్తే మరిన్ని నిధులు ఇస్తామని మంత్రి నారాయణ గురువారం జరిగిన సమావేశంలో తెలిపారని అన్నారు. మున్సిపాలిటీలో ఇప్పటికి ఆస్తి పన్ను వసూలు సంతృప్తికరంగా సాగుతుందని కమిషనర్ తెలిపారు. రూ.5.80కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికి రూ.3.80కోట్లు వసూలు జరిగినట్టు తెలిపారు.

మహిళా మాస్టర్ హెల్త్ చెకప్‌ను వినియోగించుకోవాలి
* డిప్యూటీ డీ ఎమ్‌హెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మీ
నర్సీపట్నం(టౌన్), ఫిబ్రవరి 23: ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతీ మహిళా మాస్టర్ హెల్త్ చెకప్‌ను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీ ఎమ్‌హెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మీ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీవోస్ హోమ్‌లో ఏ ఎన్ ఎమ్‌లకు మహిళా మాస్టర్ హెల్త్ చెకప్‌పై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతీ మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీరందరికీ మహిళా ఆరోగ్యం కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దక్కరలో ఉన్న పీహెచ్‌సీకి గాని, ఏరియా ఆస్పత్రులకు గాని వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్, బీపీ, షుగర్, హార్మోన్స్‌కి సంబంధించి ఆరోగ్య పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకూ ఏ ఎన్ ఎమ్‌ల ద్వారా జిల్లా 72వేల మందికి స్క్రీగింగ్ పరీక్షలు చేసి వివిధ రోగాలతో ఉన్న 300 మందిని గుర్తించడం జరిగిందన్నారు. వీరందర్ని వైద్యం కోసం రిఫర్ చేసినట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ చైతన్య, ఫియాజ్, ఫైనాన్స్ కన్సల్టెన్స్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.