విశాఖపట్నం

నేటి నుంచి భాగస్వామ్య సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముచ్చటగా మూడోసారి విశాఖ వేదికగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు శనివారం ప్రారంభం కానుంది. సదస్సును భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. అంతకు ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామ్య సదస్సు జరిగే ఏపీఐఐసీ గ్రౌండ్స్‌కు చేరుకుని, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, విదేశీ ప్రతినిధులతో ముఖా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. గత రెండు సంవత్సరాలు జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.11.10 లక్షల కోట్లతో 876 ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. తాజాగా మూడో విడత భాగస్వామ్య సదస్సులో రూ.3 లక్షల కోట్ల మేర 300 ఎంవోయూలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆమేరకు ప్రతిపాదనలు అందినట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. సుమారు 18 దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక శాఖల మంత్రులు, 50 దేశాల నుంచి అతిధులు, పారిశ్రామిక వేత్తలు సదస్సులో పాల్గొననున్నారు. వీరికి అతిధి, మర్యాదల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అతిధుల కోసం సుమారు 200 వాహనాలను సమకూర్చారు. అతిధుల బస నిమిత్తం నగరంలోని అన్ని స్టార్ హోటళ్లలో గదులు అందుబాటులో ఉంచారు. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు దేశాలకు చెందిన వాణిజ్య, పారిశ్రామిక మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. సదస్సులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పాల్గొంటారన్న సమాచారం ఉందని, అయితే అంబానీ పర్యటన పూర్తిగా ఖరారు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సదస్సు ప్రాంగణంతో పాటు నగరం మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గత రెండు భాగస్వామ్య సదస్సుల్లో మూడు హాల్స్ సహా, ఎగ్జిబిషన్ కోసం వేదికలు ఏర్పాటు చేయగా, ఈ సారి ఐదు హాల్స్‌ను, ఎగ్జిబిషన్ వేదికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విదేశీ వాణిజ్య శాఖల మంత్రులు, ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజాల కోసం ఒక హాల్‌ను కేటాయించారు. ప్రధాన హాల్‌లో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలతో పాటు భారీ స్థాయిలో జరిగే సభలు నిర్వహిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు కూడా ప్రత్యేకంగా ఒక హాల్‌ను కేటాయిచారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సదస్సు ఏర్పాట్ల తీరును పర్యవేక్షిస్తున్నారు.