విశాఖపట్నం

పేకాట శిబిరంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, మార్చి 12: మండలంలోని నడింపాలెం సమీప జీడిమామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి కొయ్యూరు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కొయ్యూరు ఎస్సై రుక్మంగధరరావు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. నడింపాలెం సమీపంలో పేకాట పందాలు సాగుతున్నాయన్న సమాచారంతో కొయ్యూరు సి. ఐ. ఉదయ్‌కుమార్ ఆదేశాలతో కొయ్యూరు, కృష్ణాదేవిపేట ఎస్సైలు రుక్మంగధరరావు, రమేష్‌లు అక్కడికి వెళ్ళి శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఈదాడిలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి 27,130 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడి పందాలు, పేకాట వంటి జూదక్రీడలు నిర్వహించిన , ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా ఎస్సై హెచ్చరించారు.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
చోడవరం, మార్చి 12: కుటుంబ కలహాలతో మహిళ చీమలమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానిక తామరచెరువు వీధి వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. స్థానిక తామరచెరువు వీధికి చెందిన గుమ్మాన పద్మ కుటుంబ కలహాల కారణంగా ఇంటివద్దనే చీమల మందు సేవించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లి అక్కడ స్ప్రహతప్పి పడిపోవడంతో పోలీసులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఆమె స్ప్రహలోకి వస్తేగాని ఆత్మహత్యకు పాల్పడటానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం
చీడికాడ, మార్చి 12: రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సాఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయమని జిల్లా వైఎస్సాఆర్ సిపి రైతు విభాగం అధ్యక్షులు సుంకరి రుద్రి అన్నారు. మండల కేంద్రమైన చీడికాడలో వైఎస్సాఆర్ సిపి కార్యాలయాన్ని పార్టీ మండల కన్వీనర్ యర్రా అప్పారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రుద్రి మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరించి పరిపాలన సాగిస్తుందన్నారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో టీడీపీ ప్రభుత్వం వలన ప్రజలు విసుగు చెందారన్నారు. కార్యకర్తలు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కోరారు. పార్టీ కార్యాలయానికి యర్రా అప్పారావుసొంత భవనం సమకూర్చడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల యూత్ కన్వీనర్ గొల్లవెల్లి రాజుబాబు, మాజీ జెడ్పీటీసీ చలుగు పెద సత్యనారాయణ, పార్టీ నాయకులు మజ్జి దేవానందం, పంచాడ సింహాచలంనాయుడు, కన్నూరు చెల్లం నాయుడు, నందరాపురమణబాబు తదితరులు పాల్గొన్నారు.

శివాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు
చీడికాడ, మార్చి 12: మండలంలో ఎల్‌బి పట్నం గ్రామంలో కాశీవిశే్వశ్వరాలయంలో సోమవారం గ్రామస్తులు ధ్వజస్తంభం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి సత్యవతి ఆలయంలో పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మధ్యాహ్నం భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ అన్నసమారాధన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.