విశాఖపట్నం

ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 12: అరకులోయలో వైసీపీ అవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు, అరకులోయ నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త చెట్టి ఫల్గుణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వైసీపీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేసి, పేద కుటుంభాలకు దుస్తులు అందచేసారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు విచ్చేసిన కుంభా రవిబాబు, ఫల్గుణలకు గిరిజనులు అపూర్వ స్వాగతం పలికి రాజశేఖరరెడ్డి విగ్రహాం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రవిబాబు, ఫల్గుణ మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం వైసీపీ ఆవిర్భవించిందని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడ్డ తమ పార్టీకి అన్ని వర్గాల వారి ఆదరణ లభిస్తోందని వారు పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వారు చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వారు అన్నారు. ప్రజాధరణ కలిగిన తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తధ్యమని రవిబాబు, ఫల్గుణ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కె.అశోక్, డి.ఆనంద్, పి.చిన్నారావు, ఎస్.్భస్కరరావు, ఎస్.క్రిష్ణారావు, విజయ్, బి.సుందరరావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

నూకాంబికా అమ్మవారి గరగలు ఊరేగింపు
కృష్ణాదేవిపేట, మార్చి 12: ఈనెల 16 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలను పురష్కరించుకుని సోమవారం నుండి గరగల ఊరేగింపు కార్యక్రమం ప్రారంబించారు. ఈమేకరు ఇక్కడ ఊరేగిస్తున్న అమ్మవారి గరగలకు మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు.కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ గరగలను ఏజన్సీ, మైదాన ప్రాంతాల్లో ఊరేగిస్తున్నామన్నారు. ఈ ఊరేగింపు తిరిగి ఈనెల 15న లింగంపేట అమ్మవారి గుడికి చేర్చి జాతర ఉత్సవాలు ప్రారంభించనున్నట్లు కమిటీ తెలిపింది.

గిరిజన యూనివర్శిటీ బిల్లు ప్రవేశపెట్టాలంటూ జె ఎ సీ జీపుజాతా
కృష్ణాదేవిపేట, మార్చి 12: ఈపార్లమెంట్ సమావేశాల్లో గిరిజన యూనివర్శిటీ బిల్లు పెట్టాలని, బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరాదని డిమాండ్ చేస్తూ జె. ఎ.సీ ఆధ్వర్యంలో ప్రారంభించిన జీపుజాత సోమవారం ఇక్కడకు చేరుకుంది. ఈసందర్భంగా జె. ఎ.సి. ప్రధాన కార్యదర్శి ఎ. అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జీపు జాతా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఫ్యాకేజీకి నిధులు కేటాయించాలని పార్లమెంట్‌లో గిరిజన యూనివర్శిటీ బిల్లు ప్రవేశపెట్టాలని, బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరాదని ఈ జీపుజాతా చేపట్టినట్లు వారు తెలిపారు.