విశాఖపట్నం

రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 12: పాడేరుకు సమీపాన చింతలవీధి గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ దుర్మరణం పాలయ్యింది. మండలంలోని గుత్తులపుట్టు పంచాయతీలో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఈశ్వరమ్మ (35) గుత్తులపుట్టు నుంచి పాడేరు వస్తుండగా వెనుకనుంచి వచ్చిన క్వారీ లారీ ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఈశ్వరమ్మ ఐదు నెలల గర్భిణీ కావడంతో పలువురి హృదయాలను తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బైటపడ్డాడు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న పాడేరు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఈశ్వరమ్మ మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన ఈశ్వరమ్మ కుటుంభాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు. ఇద్దరు పిల్లలు, భర్తతో జీవిస్తున్న ఆమె కుటుంభ పోషణకు దిక్కుగా ఉన్నారని, ఈ పరిస్థితులలో ఆమె మృతి చెదండం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేసారు.