విశాఖపట్నం

డీ ఐజీ సమక్షంలో 3.50 కోట్ల గంజాయి దగ్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, మార్చి 13: వివిధ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మూడు కోట్ల 50 లక్షల రూపాయల విలువైన గంజాయిని డీ ఐజీ సి.హెచ్.శ్రీకాంత్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నర్సీపట్నం ఎ ఎస్పీ అరీప్ హఫీజ్ సమక్షంలో మంగళవారం మారకద్రవ్య నిరోధక బృందం దగ్ధం చేసింది. మండలంలో కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ సమీపంలో భారీ గొయ్యిని తవ్వి దీనిలో వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకువచ్చిన గంజాయిని పోసారు. ఈసందర్భంగా డీ ఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్తకోట సర్కిల్ పరిధిలో రోలుగుంట, కొత్తకోట, మాకవరపాలెం పోలీస్ స్టేషన్లలో 2013 నుంచి 2017 వరకు వివిధ కేసుల్లో పట్టుబడిన ఏడువేల కిలోల గంజాయిని కోర్టు అనుమతితో దగ్ధం చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన లక్షా 50 వేల కిలులు కాగా కోర్టు అనుమతి వచ్చిన 11 వేల కిలోలను గత నెలోల విశాఖలో దగ్ధం చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఇంకా అనుమతులు రాగానే మిగిలిన గంజాయిని దశల వారీగా దగ్ధం చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో నర్సీపట్నం డి ఎస్పీ వివేకానంద, కొత్తకోట ఎస్సై శేఖరం, రావికమతం ఎస్సై రామకృష్ణ, రోలుగుంట ఎస్సై హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హిట్లర్‌ను మించిన నియంత మోదీ
మునగపాక, మార్చి 13: హిట్లర్, నెపోలియన్‌లను మించిన నియంతలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఉత్తరాంధ్ర జిల్లా చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ హితవు పలికారు. మండల కేంద్రమైన మునగపాకలో మంగళవారం స్థానిక విలేఖర్ల సమావేశంలో మాజీమంత్రి కొణతాల మాట్లాడుతూ విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, బుందేల్‌ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి, కడప స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, పెట్రోకెమికల్ కారిడార్, విశాఖ - చెన్నై కోస్టల్ కారిడార్ రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఐదు కోట్ల తెలుగు ప్రజలను తీవ్ర నిరాశ, నిస్ప్రహలకు గురిచేసాడని రామకృష్ణ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోడీ వ్యక్తిగత కక్ష ఉంటే మరో రూపంలో తీర్చుకోవాలి గాని ఏపీకీ తీరని అన్యాయం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ప్రధానులుగా చేసిన వారు ఇంతగా వ్యవహరించలేదని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 350కోట్ల నిధులు మంజూరు చేసి వాటిని వెనక్కు తీసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. కాకినాడ సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న ప్రధాని ఇప్పుడు ఒక్క ఓటు మూడు రాష్ట్రాలు అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేసారు. విభజన రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మి ఓట్లు వేసి ప్రధాని మోడీ తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసారని అన్నారు. బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు ఇప్పటివరకు ప్రత్యేక రైల్వేజోన్, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు ఇప్పిస్తామని నమ్మబలికిన ఎంపీ లక్షల కోట్లు మంజూరు చేసామని అబద్దాలు వల్లిస్తున్న ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పుకోరాలని ఆయన సవాల్ విసిరారు. రాజ్యాంగంలోని అత్యున్నత పదవిలో ఉన్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాను మించి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని నమ్మబలికి రాష్టవ్య్రాప్తంగా అనేక సన్మానాలు సత్కారాలు పొందిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని కొణతాల ప్రశ్నించారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఎస్.రాయవరం, మార్చి 13: మండల కేంద్రమైన ఎస్. రాయవరంలో కుటుంబ కలహాలు కారణంగా వేపకాయల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్. రాయవరం పోలీసులు తెలిపారు. ఆదివారం కుటుంబంలో జరిగిన స్వల్ప కలహాల కారణంగా ఆదివారం రాత్రి పురుగుల మందు సేవించడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స కోసం నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుమర స్వామి తెలిపారు.