విశాఖపట్నం

రాజకీయ ఒత్తిడులకు తలొగ్గిన ‘రెవెన్యూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 13: ప్రజా ధనం వృధా చేసిన, ప్రభుత్వ ఆస్తులకు నష్టకలిగించిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిలో కొంతమందిని శిక్షణించి, మరికొంతమందిని నిర్దోషులుగా విడిచిపెట్టిన ఘటనలు విశాఖ రెవెన్యూ శాఖలో నిత్యం దర్శనమిస్తున్నాయి. విశాఖలో సుమారు 3000 కోట్ల రూపాయల భూ కుంభకోణంలో కేవలం కొద్ది మంది రెవెన్యూ అధికారులపైనే చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతోమంది పాత్ర ఉన్నా, రాజకీయ ఒత్తిడులు కారణంగా వారిని విడిచిపెట్టారు. తాజాగా మధురవాడ భూముల విషయంలో జరిగిన అవకతవకల్లో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్రధారి విశాఖపట్నం ఆర్డీఓను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే, రావికమతం తహశీల్దారును సీసీఏకు సరెండర్ చేశారు. ఈ వ్యవహారంలో వీరిద్దరే దోషులుగా ఉన్నతాధికారులు తేల్చారు. ఇందులో నిర్దోషులుగా బయటపడిన వారు కేవలం రాజీయ పలుకుబడి ఉన్నవారన్నది వాస్తవం. 11.14 ఎకరాల భూ బదలాయింపులో మరికొంతమంది పాత్ర సాక్ష్యాధారాలతో సహా బయటపడినా, రాజకీయ ఒత్తిడుల మేరకు వారికి క్షమా భిక్ష ప్రసాదించినట్టు అవగతమవుతోంది.

విశాఖ మెట్రోకు ఎస్పీవీ
* ఉత్తర్వులు జారీ చేసిన పురపాలకశాఖ
* మెట్రో నిర్మాణానికి దక్షిణ కొరియా రుణ సహాయం
విశాఖపట్నం, మార్చి 13: విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేస్తూ పురపాలకశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) లిమిటెడ్ కింద విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనిచేయబోతోంది. ఈ రైల్వే బోర్డుకు సంబంధించి డైరెక్టర్ల నియామకం చేయనుంది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రాజెక్టు డైరెక్టర్లలతోపాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు కూడా ఉంటారు. ఈ నియామకాలన్నీ జరిగేవరకూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఎన్.పి రామకృష్ణారెడ్డి విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టుకు కూడా ఎండీగా వ్యవహరిస్తారని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వల్లవన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెట్రోకు టెండర్ ప్రక్రియను నిర్వహించి, అర్హులైన సంస్థకు టెండరు ఖరారు చేయాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. ఈప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించి 2014 భూసేకరణను, పునరావాస చట్టం మేరకు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం ఏఎంఆర్‌సీ ఎండీగా ఉన్న రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడేళ్ళపాటు పొడిగించింది. నగరంలో 42.55కిలోమీటర్ల మేర మూడు కారిడార్లలో నిర్మించనున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.8,800కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. గాజువాక-కొమ్మాది, గురుద్వార్-పాతపోస్ట్ఫాస్, తాటిచెట్లపాలెం-చినవాల్తేరుల మధ్య ఈ కారిడార్లను నిర్మిస్తారు. కిలోమీటర్‌కు రూ.210కోట్లు ఖర్చు కానుంది. మొత్తం వ్యయంలో ప్రభుత్వం వాటా 53శాతం, ప్రైవేటు సంస్థ 47శాతం ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వం రూ.4,600 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలింది ప్రైవేటు సంస్థ పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వం దక్షిణకొరియా బ్యాంకు నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.