విశాఖ

వచ్చే ఏడాదికి స్మ్రతివనం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 17: మండలంలో మార్టూరు కూడలికి సమీపంలో ఉన్న బవులవాడ గుట్ట వద్ద అశోకచక్ర అవార్డు గ్రహీత, వీరసైనికుడు కరణం వరప్రసాద్ 5వ వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రేహౌండ్స్ డిఐజి వినీత్ బ్రిజ్‌లాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వచ్చే ఏడాదికల్లా వరప్రసాద్ సంస్మరణార్ధం స్మ్రతివనంతోపాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తాను ఎస్పీగా ఉన్నప్పటి నుండి కూడా వరప్రసాద్ తనకు తెలుసునని డిఐజి తెలిపారు. స్మ్రతివనం 46 సెంట్ల స్థలంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2013 ఏప్రిల్ 13న ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్ నుండి 30మంది గ్రేహౌండ్ దళాల నుండి కాపాడి ఆదర్శంగా నిలిచారు. డిజిపి దినేష్ రెడ్డి, గ్రేహౌండ్స్ ఐజి రాములు, ఎస్పీలు గంటమనేని శ్రీనివాసరావు, కోయ ప్రవీణ్‌కుమార్ తదితర పోలీస్ పెద్దలు, జిల్లామంత్రి గంటా శ్రీనివాసరావు పలువురు రాజకీయ నాయకులు స్మ్రతివనం ఏర్పాటు చేస్తామని, విగ్రహాన్ని నిర్మిస్తామని అనేక రకాల హామీలు గుప్పించారే కానీ వాటిని నేటికి కార్యరూపం దాల్చకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుబ్రహ్మణ్యం, ఆర్క్ సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్, పట్టణ సిఐ మురళీరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.