విశాఖ

మొండి బకాయిల రికవరీకి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొలుగొండ, ఏప్రిల్ 17: స్థానిక ఎస్‌బీ ఐ బ్రాంచ్ పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాల ద్వారా కోటి 29 లక్షల రూపాయలు మొండి బకాయిలు పేరుకుపోయాయని స్థానిక ఎస్‌బీ ఐ బ్రాంచ్ మేనేజర్ వి.శరత్‌చంద్ర అన్నారు. మంగళవారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని ఎస్‌బీ ఐ బ్రాంచ్ పరిధిలో ఏడు గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూప్ సంఘాల సభ్యులు గత మూడు సంవత్సరాల కాలం నుండి రుణాలు పొందిన నాటి నుండి తిరిగి బాకీలు చెల్లించలేదన్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఆయా సంఘాల సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా బాకీలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. పప్పుశెట్టిపాలెం, పేటమాలపల్లి, కొత్తజోగుంపేట, జోగుంపేట, ద్వారకానగరం, అమ్మపేట, కొయ్యూరు మండలానికి చెందిన చిట్టింపాడు గ్రామాలకు చెందిన 59 డ్వాక్రా సంఘాలు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందారన్నారు. రుణాలు తిరిగి చెల్లించడంలో ఈ సంఘాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. రికవరీ కోసం ఆయా గ్రామాలకు వెళ్ళినా ప్రయోజనం లేదన్నారు. ఈసంఘాల గ్రూప్‌లపై జిల్లాకలెక్టర్‌కు వినతి పత్రం అందజేసామని బ్రాంచ్ మేనేజర్ శరత్‌చంద్ర తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యుల నుండి నిధుల రికవరీకి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు వెలుగు సిబ్బంది రికవరీకి సహకరించాలన్నారు. ఈకార్యక్రమంలో ఫీల్డ్ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

విఆర్‌ఎలను పట్టించుకోని ప్రభుత్వం
అనకాపల్లి, ఏప్రిల్ 17: బ్రిటీష్ కాలం నాటి నుండి ఉన్న తలయారీ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం విఆర్‌ఎలను పట్టించుకోవడం లేదని సిఐటియు నాయకులు బాలకృష్ణ గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద విఆర్‌ఎ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నానుద్ధేశించి వారు మాట్లాడుతూ విఆర్‌ఎల న్యాయమైన కోర్కెలు 10వేల 500 రూపాయలకు జీతాలను పెంచాలని, 010 పద్దుపై జీతాలు ఇవ్వాలని, ప్రమోషన్లలో 70శాతం రిజర్వేషన్‌లు వర్తింపజేయాలని, ల్యాండ్ ప్యూరిఫికేషన్ విఆర్‌ఎలకు రెమ్యునరేషన్ ఇవ్వాలని, నామినీ విఆర్‌ఎలుగా గుర్తించాలని, రిక్రూట్‌మెంట్ చేస్తున్న విఆర్‌ఎలను రెగ్యులర్ చేయాలని, అనకాపల్లి డివిజన్‌లో పనిచేస్తున్న అటెండర్‌లకు పధోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేసారు. సంఘం జిల్లా అధ్యక్షులు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ 2015లో ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు మేం పెట్టిన డిమాండ్లు ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ నేటివరకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయకపోవడంతో ఆందోళనలు చేయక తప్పలేదన్నారు. ఈ ఆందోళనకు ఆర్డీవో కార్యాలయం పరిధిలో ఉన్న అన్ని మండలాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో టి. సముద్రం, పలివెల వెంకట్రావు, సిఐటియు నాయకులు దాకారపుశ్రీనివాస్, పిఎన్‌వి పరమేశ్వరరావు, ఎం. భాస్కరరావు, 12మండలాల నుండి విఆర్‌వోలు పాల్గొన్నారు.