విశాఖ

విజయవంతమైన ఎడ్ల బళ్ళ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, ఏప్రిల్ 17: మండలంలో లింగాపురంలో పోలేరమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బళ్ళ పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈజాతరలో ఈపోటీలు ప్రత్యేక ఆకర్సణగా నిలిచాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. లింగాపురం పెద్ద చెరువులో సాయంత్రం నాలుగు గంటల నుంచి నిర్వహించిన పోటీలు ఆరు గంటల వరకు కొనసాగాయి. పోటీల్లో గ్రామ సర్పంచ్ సుర్ల పోలమ్మ, గ్రామ పెద్దలు ఎస్.నారాయణమూర్తి, కె.వరహాలబాబు, సర్వసిద్ధి శ్రీరామ్మూర్తి, గుడివాడ శ్రీరామ్మూర్తిలు పాల్గొన్నారు.
కైలాసపట్నం ఇసుక ర్యాంప్‌లో తవ్వకాలు నిలిపివేయాలి
కోటవురట్ల, ఏప్రిల్ 17: గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మండలంలో కైలాసపట్నం ఇసుక ర్యాంప్‌లో తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు తహశీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఇసుక తవ్వకాల వలన భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు పని చేయడం లేదని కైలాసపట్నం గ్రామస్తులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ శ్రీనివాస్ మైన్స్ అధికారులతో కలిసి కైలాసపట్నం ఇసుక ర్యాంప్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డీ వీ ఎస్ రాజు, గ్రామ మాజీ సర్పంచ్ సిద్దాబత్తుల నాగేశ్వరరావుపలువురు రైతులు మాట్లాడుతూ ఇసుక తవ్వకాలు వలన తాగు, సాగునీటికి కొరత ఏర్పడుతుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్నామని తహశీల్దార్ తెలిపారు. కైలాసపట్నంలో ఇసుక తవ్వకాలు నిలిపివేసి గొట్టివాడ ర్యాంప్‌లో అనుమతులు ఇస్తామని తహశీల్దార్ తెలిపారు.

సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు
* వెయి లీటర్ల పులుపు ధ్వంసం
సీలేరు, ఏప్రిల్ 17: ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం దారకొండలో సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో సారా తయారీకి నిల్వ ఉంచిన పులుపును ధ్వంసం చేసారు. దారకొండలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం ఎక్సైజ్ ఎస్సై జగదీష్‌కు సమాచారం అందడంతో ఆకస్మికంగా సారా బట్టీలపై దాడులు ఎక్సైజ్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. దారకొండ సమీపంలో ఉన్న సాకిరేవుగెడ్డ ప్రధాన కేంద్రంగా మలుచుకుని నాటుసారాను విచ్చల విడిగా తయారు చేస్తుండడంతో దీనిపై గత 10 రోజులుగా నిఘా పెట్టారు. ఈనేఫధ్యంలో మంగళవారం సారా బట్టీలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి బట్టీల వద్ద నిల్వ ఉంచిన ఐదు డ్రమ్‌లతో ఉన్న వెయ్యి లీటర్ల పులుపును ధ్వంసం చేసారు. అనంతరం ఒడియా క్యాంప్‌లో పలు ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. అలాగే దారకొండలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు చేస్తే కేసులు తప్పవని ఎస్సై జగదీష్ హెచ్చరించారు.