విశాఖ

వ్యాధుల నివారణకు కృషి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, ఏప్రిల్ 17: గిరిజన గ్రామాలలో ప్రబలుతున్న వ్యాధుల నివారణకు విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ సూచించారు. మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మన ఆరోగ్యం-మన చేతుల్లో అనే ఆరోగ్య కరపత్రాలను ఆయన మంగళవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెలవులకు తమ తమ ఇళ్లకు వెళ్లినప్పుడు ఆరోగ్య సూత్రాలపై తమ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించి వారిలో అవగాహన కల్పించాలని చెప్పారు. నిరక్షరాస్యులైన గిరిజనులకు ఆరోగ్య సూత్రాలపై సరైన అవగాహన లేకపోవడం, అంధ విశ్వాసాలను అనుసరిస్తుండడం వంటి కారణాల వలన వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం లేదని ఆయన అన్నారు. దీనివలన గిరిజన ప్రాంతంలో వ్యాధులు ప్రబలి అనేక దుస్పరిణామాలకు దారితీస్తోందని ఆయన చెప్పారు. విద్యావంతులైన యువత తమ తమ గ్రామాలలోని గిరిజనులకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతను చేపట్టాలని ఆయన కోరారు. మన ఆరోగ్యం-మన చేతుల్లోనే అనే కరపత్రంలోని అంశాలను గిరిజనులకు చదవి వినిపించాలని, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలడానికి గల కారణాలను వారికి తెలియచేయాలని ఆయన సూచించారు. ఏజెన్సీలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కరపత్రాలను అందచేసేందుకు చర్యలు తీసుకోవాలని రవిసుభాష్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజి మాట్లాడుతూ ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు విద్యార్థులు చెట్ల కిందకు వెళ్లరాదని చెప్పారు. చెట్ల కింద వర్షానికి రక్షణ కల్పించుకుంటే పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. గిరిజన యువత మత్తు పదార్థాలకు బానిస కారాదని ఆయన అన్నారు. ఆంత్రాక్స్ వ్యాధిని గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.