విశాఖపట్నం

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 17: సురక్షిత రోడ్డు రవాణాకు, ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ జీ సృజన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డుసేఫ్టీ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు సేఫ్టీ కమిటీ కన్వీనర్, డీటీసీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 30 వరకూ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలును వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 43,391 కేసులు నమోదు కాగా, వీటిలో డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, లైసెన్సు లేకపోవడం, ఓవర్‌లోడ్, తదితర కేసులు ఉన్నాయన్నారు. గతేడాది మార్చిలో 588 రోడ్డు ప్రమాదాలు సంభవించి 187 మంది మృత్యువాత పడగా, ఈ ఏడాది 482 ప్రమాదాల్లో 130 మంది మరణించారన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ సమన్వయంతో గత 15 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ శాఖలు రోడ్డు సేఫ్టీ నిమిత్తం అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజకుమార్, జీవీఎంసీ, రహదార్లు భవనాల శాఖ, పంచాయితీరాజ్, వుడా, ఆర్టీసీ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.