విశాఖపట్నం

హోదా, రైల్వేజోన్‌పై క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధించేందుకు క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో నిర్ణయించారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిన అన్యాయంపై క్షేత్ర స్థాయిలో పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సహా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంటి అంశాలపై పోరాడాలని నిర్ణయించారు. పార్టీని బూత్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు కష్టపడిన కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. బూత్ కమిటీల ఏర్పాటుకు సంబంధించి నగర పరిధిలో అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ సారధ్యంలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సమావేశంలో వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, సత్తిరామకృష్ణా రెడ్డి, పీ ఉషాకిరణ్, సనపల చంద్రవౌళి, తిప్పల నాగిరెడ్డి, అక్కరమాని విజయనిర్మల, అదీప్‌రాజ్, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.