విశాఖపట్నం

విభజన హామీలు విస్మరించి, టీడీపీపై విమర్శలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 17: విభజన చట్టం హామీలను విస్మరించి, టీడీపీ విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీని మట్టికరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అర్బన్ జిల్లా టీడీపీ స్పష్టం చేసింది. నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అర్బన్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చోడే పట్ట్భా మాట్లాడుతూ గత ఎన్నికల ముందు విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలకు వాగ్దానం చేసిన బీజేపీ, ఇప్పుడు వెనక్కు తగ్గడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంస్కరణలు అద్భుతం అంటూ ప్రశంసించిన బీజేపీ హఠాత్తుగా మాటమార్చడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనాను భవాన్ని, రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడులను పేర్కొంటూ పొడగడ్తలతో ముంచెత్తి ఇప్పుడు విమర్శలకు దిగడం రాజకీయ దురుద్దేశమేనన్నారు. రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఉనికినే కోల్పోయిందని, ఇప్పుడు అదే తీరులో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ కూడా కనుమరుగుకాక తప్పదని హెచ్చరించారు. నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మొన్నటి వరకూ ముఖ్యమంత్రి పనితీరును కొనియాడారని, ఇప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇటువంటి నాయకులకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ వైఫల్యాలను తెలుసుకుని ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి, పల్లా శ్రీనివాసరావు, పాశర్ల ప్రసాద్, వీఎస్‌ఎన్ మూర్తి యాదవ్, శరగడం చిన అప్పలనాయుడు, అధికార ప్రతినిధి సనపల పాండురంగారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.