విశాఖ

ప్రాణాలను కాపాడుకునేందుకు హెల్మెట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 24: రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాపాయ బారి నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించడం తప్పనిసరని స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకునాయుడు అన్నారు. 29వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా స్థానిక దండకారణ్య వృత్తి విద్యాకోర్సు ప్రయివేట్ కళాశాల, యువజన శిక్షణ కేంద్రాల వద్ద యువతకు హెల్మెట్‌ల వినియోగం, ప్రయోజనాలు అనే అంశంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్‌లు ధరించి ప్రయాణం చేస్తే బహు ప్రయోజనాలు పొందవచ్చునని చెప్పారు. ప్రమాదాలు సంబవించినపుడు ప్రాణాపాయం లేకుండా హెల్మెట్‌లు కాపాడుతాయని ఆయన అన్నారు. హెల్మెట్‌లు ధరించకుండా ప్రయాణం చేసి ప్రమాదాల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలు కాపాడుకోవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు లోనై కుటుంభం నుంచి సభ్యత్వం కోల్పోయి దూరం కావద్దని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని, సామర్థ్యానికి మంచి వాహనాలపై ఎక్కువ మందిని కూర్చోబెట్డవదని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన రికార్డులతో పాటు లైసెన్స్, హెల్మెట్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన చెప్పారు. కార్లు నడిపే డ్రైవర్లు సీటు బెల్టు క్రమం తప్పకుండా వేసుకోవాలని ఆయన అన్నారు. లైసెన్స్‌లు లేనివారు హెల్మెట్‌లతో వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో దరఖాస్తు చేసుకుంటేనే వారి పేర్లను లైసెన్స్ కోసం నమోదు చేస్తామని ఆయన చెప్పారు. హెల్మెట్ లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి లైసెన్స్ మంజూరు చేసే ప్రశక్తే లేదని ఆయన స్పష్టం చేసారు. ఈ నెల 11, 12, 23, 24వ తేదీలలో మేళా ద్వారా ఎల్.ఎల్.ఆర్. పొందిన అభ్యర్థులకు క్రమ పద్దతిలో శాశ్వత లైసెన్స్‌లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రవాణా శాఖ అధికారులతో సంప్రదింపులు చేసి శాశ్వత లైసెన్స్‌లు మంజూరు చేసే తేదీలను ఖరారు చేసి త్వరలో ప్రకటిస్తామని వెంకునాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణాశాఖ అనకాపల్లి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ అరకులోయలో నిర్వహించిన లైసెన్స్ మేళా ద్వారా దాదాపు రెండు వేల మందికి ఎల్.ఎల్.ఆర్. పత్రాలు మంజూరు చేసామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో డుంబ్రిగుడ ఎస్.ఐ. అమ్మనరావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జి.సత్యనారాయణ, ఎం.కాశీవిశ్వనాధ్, కె.సుమన్‌కుమార్, ఎం.అనీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

అంగన్‌వాడీలపై లాఠీ చార్జి దుర్మార్గం
అరకులోయ, ఏప్రిల్ 24: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా విశాఖపట్నంలో ఆందోళన నిర్వహిస్తున్న అంగన్‌వాడీలపై పోలీసులు లాఠీ చార్జి చేయడం దుర్మార్గమైనదని సి.ఐ.టి.యు. అరకు డివిజన్ కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు అన్నారు. అంగన్‌వాడీలపై లాఠీ చార్జికి నిరసనగా అరకులోయ పట్టణంలో సి.ఐ.టి.యు. నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా లాఠీ చార్జి చేయడాన్ని ఖండించారు. అంగన్‌వాడీలపై లాఠీ చార్జిలు చేయించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలకు స్వస్తి పలకకపోతే తగిన గుణపాఠం తప్పదని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నాయకులు టి.హరి, సింహాద్రి, రమణ, అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమ సంఘం నాయకులు పి.బిమల, నిర్మల, జానకి, బాను తదితరులు పాల్గొన్నారు.