విశాఖపట్నం

మత్స్యకారులను మభ్యపెడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: మత్స్యకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా మోసగించాయని ఆలిండియా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మెట్టు ప్రసాద్ ఆరోపించారు. నగర కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 సాధారణ ఎన్నికలకు ముందు మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చేందుకు హామీ ఇచ్చారని, అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఈ అంశంపై టీడీపీ నోరు మెదపట్లేదన్నారు. చేపలవేట నిషేధ కాలంలో బోటు యజమాని, అందులో పనిచేసే కార్మికులకు మాత్రమే పరిహారం ఇస్తున్నారని, చేపలు విక్రయించే మత్స్యకార కుటుంబాలు మాత్రం ఉపాధిలేక రోడ్డున పడుతున్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా తీరప్రాంతం, సముద్ర సంప్రదాయ మత్స్యకారుల రక్షణ చట్టం-2009 రూపకల్పనకు చర్యలు తీసుకుందన్నారు. ఈ ముసాయిదాను చట్టంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షల మంది మత్స్యకారులు చేపల విక్రయం ఆధారంగా జీవిస్తున్నారని, వీరికి వౌలిక సదుపాయాలతో పాటు వ్యాపార రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలిండియా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రేవు రత్నకుమారి, గొల్ల జోగిరాజు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.