విశాఖపట్నం

గిరిజన యూనివర్శిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 93, షెడ్యూల్ 13 ఆధారంగా నవ్యాంధ్రలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని విశ్రాంత వైస్‌ఛాన్స్‌లర్‌లు డిమాండ్ చేశారు. నగరంలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఒకే గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లోని అమర్కంటక్ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. యూనివర్శిటీ ఏర్పాటు కోసం 2007లో ‘ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ చట్టం -2007’ను ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల తొమ్మిది మంది సభ్యులున్న బృందం యూనివర్శిటీని పరిశీలించిందన్నారు. సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 30 విభాగాలు, పలు డిగ్రీ, పీజీ, రీసెర్చ్ కోర్సులు నిర్వహిస్తున్నారన్నారు. కేంపస్‌లో మొత్తం 2,628 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో మహిళలు 1226 (46.65శాతం), గిరిజనులు 1084 (41.24 శాతం), దళితులు 321 (12.21 శాతం), ఓబీసీలు 642 (24.42 శాతం) విద్యార్జన చేస్తున్నారన్నారు. అంటే 2047 మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని గణాంకాలతో వివరించారు. యూనివర్శిటీలో గిరిజన భాషలు, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించేలా ప్రత్యేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. గిరిజన భాషల అర్థాలతో కూడిన నిఘంటువులు తయారు చేస్తున్నారని, లిపి లేని గిరిజన భాషలకు ప్రత్యేక లిపి రూపొందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. గిరిజన కళలను ప్రోత్సహించేలా ఇక్కడ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. గిరిజనులు, వెనుకబడిన వారి అభ్యున్నతికి దోహదం చేసే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం ఇప్పటికీ తాత్సారం చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికే గిరిజన యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో 526.22 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఇక కేంద్రం చొరవ తీసుకుని గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. వైస్‌ఛాన్స్‌లర్, ఇతర సిబ్బందిని నియమించాలని, ప్రస్తుత సంవత్సరానికి రూ.400 కోట్లు కేటాయించి విడుదల చేయాలని, నిర్మాణం పూర్తయ్యేలోగా తాత్కాలిక కేంపస్‌లో తరగతులు ప్రారంభించాలని, జేఎన్‌టీయూ కేంపస్‌లో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలిని సూచించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ వైస్‌ఛాన్స్‌లర్లు కెవీ రమణ, కేఎస్ చలం, జీఎస్‌ఎన్ రాజు, వీ బాలమోహన్ దాస్, ఇక్బాల్ అహ్మద్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ప్రొఫెసర్లు తిమ్మారెడ్డి, పీ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.