విశాఖపట్నం

శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: కలియుగ దైవం, దేవదేవుడైన వేంకటేశ్వరునికి, పద్మావతి అమ్మవారికి విశాఖ వేదికగా బుధవారం కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి నేతృత్వంలో కన్నుల పండువగా ఈ కళ్యాణం జరుగుతోంది. వారిజ, వికాస తరంగిణి ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తోంది. ఈ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అహోబిల జీయరు స్వామి మంగళవారం విలేఖరులకు వివరించారు. విళంబినామ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే శ్రీరామచంద్రమూర్తి అవతరించారు. అలాగే వేంకటేశ్వరుడు పద్మావతిని పరిణయమాడాడు. ఈ మహోత్కృష్ఠ పర్వదినం 60 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. 60 సంవత్సరాలకు ముందు ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారో? లేదో? తెలియదు. వచ్చే 60 సంవత్సరాల తరువాత జరుగుతుందో? లేదో? తెలియదు. అందుకని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరు స్వామి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించ తలపెట్టారు. వైశాఖ శుక్ల దశమి బుధవారం విళంబి వైశాఖ శ్రీనివాసం పేరుతో దేవదేవుని వివాహ వేడుకలు జరుపుతున్నారని అహోబిల జీయరు స్వామి చెప్పారు. ఈ కళ్యాణాన్ని శాంతి కళ్యాణం అని కూడా పిలుస్తున్నట్టు చెప్పారు. సప్తమి రోజుల వేంకటేశ్వరుడు తన వివాహం కోసం కుబేరుని దగ్గర రుణం తీసుకున్నాడని చెప్పారు.
గతంలో ఎక్కడా జరగని విధంగా వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం జరుగుతోంది. విశాఖ నగరంలోని 12 వెంకటేశ్వరస్వామి ఆలయాల నుంచి విగ్రహాలను రప్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో పెళ్లికి ముందు వేసే ముహూర్తపు రాట, పసుపు దంచడం వంటి కార్యక్రమాలు పూర్తయ్యాయని స్వామి తెలియచేశారు. స్థానిక ఏపీఐఐసీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్ద బుధవారం తెల్లవారుజాము ఐదు గంటల నుంచే మంగళ వాయిద్యాలు, వేద పారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సుప్రభాత సేవ, తోమాల సేవ, తిరుప్పావై సేవాకాలం, సహస్రనామార్చన, తీర్థ ప్రసాద గోష్ఠి, సుదర్శన ఇష్టి, తదియారాధన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు వివిధ దేవాలయాల నుంచి తీసుకువచ్చిన వేంకటేశ్వరుని విగ్రహాలను వుడా పార్క్‌కు తీసుకుస్తారు. అక్కడ నుంచి కళ్యాణ వేదిక వరకూ శోభాయాత్ర నిర్వహిస్తారు. వేదికకు కొద్ది దూరంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అక్కడి నుంచి వెంకటేశ్వరుని, పద్మావతి అమ్మవారిని వేదిక మీదకు తీసుకువస్తారు. అక్కడ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయరు స్వామి పర్యవేక్షణలో స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ కళ్యాణోత్సవ విశేషాన్ని దేవనాధరామానుజ జీయరు స్వామి వివరించారు. ఇదిలా ఉండగా ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ నేతితో కూడిన దీపాలను తీసుకురావాలని స్వామి సూచించారు. ఈ దీపాలతో స్వామికి హారతి ఇవ్వనున్నట్టు చెప్పారు. వీలైనంత వరకూ ఆడ, మగవారు సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు. ఈ విలేఖరుల సమావేశంలో వికాస తరంగిణి ప్రతినిధులు ఎంఎస్ రాజు, ఎం.నారాయణరెడ్డి, పీఎస్‌ఎన్.రాజు, యుఎస్‌ఎస్‌ఆర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.