విశాఖపట్నం

అల్లిపురంలో మెగా వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరిలోవ, మే 1: ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంపీఎం ట్రస్టు, ఎన్‌టీఆర్ సేవా సమితి ట్రస్టు, విల్లూరి చినతల్లి చారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా నగరంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. నిరంతరం కొనసాగుతున్న వైద్య శిబిరాల్లో భాగంగా 28వ వార్డు అల్లిపురం సామాజిక భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సదర్భంగా ట్రస్టు నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరాల్లో సామాన్య ప్రజానీకానికి కార్పొరేట్ వైద్య సాయం అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. సామాన్య ప్రజల ఆరోగ్య రక్షణకు ఎంపీఎం ట్రస్టు నిర్విరామ కృషి చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి విల్లూరి డాక్టర్ చక్రవర్తి అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో ఎంపీఎం ట్రస్టు ఈ శిబిరాల నిర్వహణకు ముందుకు రావడం ముదావహమన్నారు. నగరంలో 100 వైద్య శిబిరాల నిర్వహణ లక్ష్యంగా పేర్కొన్నారు. ట్రస్తు సొంత నిధులు వెచ్చించి వైద్య శిబిరాలు నిర్వహించడం, నిరుపేదలకు వైద్య సేవలందించడం ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి సేవాధృక్పథానికి నిదర్శనమన్నారు. కలుషిత వాతావరణం కారణంగా కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ముఖ్యంగా క్షయ, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బులకు సంబంధించి పలు పరీక్షలు నిర్వహించారు. అలాగే దంత, వినికిడి సమస్యల పరీక్షలు నిర్వహించారు. గీతం దంతవైద్య కళాశాల, జిమ్‌సర్ ఆసుపత్రి వైద్య నిపుణులు, సిబ్బంది వైద్య శిబిరంలో సేవలందించారు. మంగళవారం నాటి వైద్య శిబిరంలో 200 మందికి దంత పరీక్షలు, 150 మందికి కంటి వైద్య పరీక్షలు, 150 మందికి స్ర్తి సంబంధ వైద్య పరీక్షలు, 200 మందికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీవీఎస్ మూర్తి మహిళా సంఘం అధ్యక్షురాలు విల్లూరి తిరుమల దేవి, 19వ వార్డు మాజీ కార్పొరేటర్ ఆళ్ల శ్రీనివాస్, 27వ వార్డు మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.