విశాఖపట్నం

వర్షం బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 1: కేవలం మూడు గంటల వ్యవధిలో నగరంలో ఆరు సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నగరంలో జన జీవసం అస్తవ్యస్థమైపోయింది. ఉదయం ఎనిమిది గంటల వరకూ పొడిగా ఉన్న వాతావరణం ఆ తరువాత దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తొమ్మిది గంటల నుంచి బీభత్సమైన వర్షం కురిసింది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్ణా మార్కెట్ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో అనేక దుకాణాలు నీట మునిగిపోయాయి. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారు బెంబేలెత్తిపోయారు. ఊటగెడ్డ పొంగి ప్రవహించింది. నీటి ప్రవహానికి గెడ్డ పక్కనే ఉన్న ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి బీచ్ రోడ్డులని చెత్త అంతా రోడ్లమీదకు వచ్చింది. దీంతో ఆ మార్గంగుండా వెళ్లే వారు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే జ్ఞానాపురం రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరిపోవడంతో జనం చాలా ఇబ్బంది పడ్డారు. సీహార్స్ జంక్షన్ వద్ద గెడ్డ పొంగి రోడ్ల మీదకు వచ్చింది. సుమారు గంటపాటు రోడ్లపై బురదనీరు ప్రవహించింది. అలాగే జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జి కింద ఆర్టీసీ బస్సు నీటి ప్రవాహంలో నిలిచిపోయింది. ఇందులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అరగంటకు పైగా ఈ బస్సు నిలిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కేఆర్‌ఎం కాలనీలో అన్ని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గీతం ఫార్మశీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు

విశాఖపట్నం, మే 1: గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మశీ ద్వారా బీ ఫార్మశీ, ఎం ఫార్మశీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రఖ్యాత ఔషధ సంస్థ దివీస్ ల్యాబ్ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగావకాశాలు లభించాయని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ గణపతి తెలిపారు. ఏడుగురు బీ ఫార్మశీ విద్యార్థులు, ఐదుగురు ఎం ఫార్మశీ విద్యార్థులకు రూ.2.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించాయన్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన బయోఫార్ ఫార్మాస్యూటికల్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామ నియామకాల్లో ముగ్గురు ఎం ఫార్మశీ విద్యార్థులకు అవకాశాలు లభించాయన్నారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులను గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, ప్రోవైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు అభినందించారు.