విశాఖపట్నం

ప్రయాణికులకు కర్మ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: టీడీపీ తలపెట్టిన ధర్మపోరాట దీక్ష విశాఖ ప్రయాణీకుల పాలిట కర్మపోరాటంగా మారింది. దీక్షకు జనసమీకరణ నిమిత్తం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి వందల సంఖ్యలో బస్సులు మళ్లించడంతో సాధారణ ప్రయాణీకుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కో నియోజకవర్గానికి 100 నుంచి 200 బస్సులు కేటాయించగా, మంగళవారం ఉదయం నుంచి ఆయా గ్రామాలకు ప్రత్యేక బస్సులు తరలిపోయాయి. నగర పరిధిలో గల వాల్తేరు, మద్దిలపాలెం, గాజవాక, సింహాచలం, స్టీల్‌సిటీ సహా విశాఖ రూరల్, మధురవాడ డిపోల నుంచి సుమారు 1000 బస్సులు ధర్మపోరాట దీక్షకు కేటాయించారు. దీంతో సాధారణంగా నగరంలో తిరిగే సర్వీసుల్లో సగానికి పైగా కోతపడింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన కొత్తవలస, తగరపువలస సహా చోడవరం, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి 50 శాతానికి పైగా బస్సులు మళ్లించారు. దీంతో శివారు నుంచి నగరానికి చేరుకోవాల్సిన ప్రయాణీకులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ ద్వారకాబస్ కాంప్లెక్స్ వరకూ అష్టకష్టాలు పడి చేరుకున్న ప్రయాణీకులు అక్కడ నుంచి కేజీహెచ్, కలెక్టరేట్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల్లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించారు. ధర్మపోరాట దీక్షకు బస్సులు మళ్లించిన విషయం తెలియని ప్రయాణీకులు గంటల తరబడి బస్టాపుల్లోనే పడిగాపులుకాసారు. చివరకు బస్సులు దారి మళ్లాయని తెలుసుకు ఉస్సురంటూ ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేజీహెచ్‌కు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు సిటీబస్‌ల కోసం వేచిచూస్తున్నారు. దాదాపు గంట సమయం గడిచినప్పటికీ అటువైపుగా వెళ్లే బస్సులు రాకపోవడంతో కంట్రోలర్‌ను నిలదీశారు. ధర్మపోరాట దీక్షకు బస్సులు మళ్లించారని, కొన్ని సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయని వివరించగా, ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. ఇక శివారు ప్రాంతాల నుంచి నగరంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు నెలవారీ పాసులు తీసుకుంటారు. వీరంతా విధులకు నిర్ణీత సమయంలో చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గంటల తరబడి బస్సులు రాకపోవడంతో ఆటోల్లో వెళ్లాల్సి వచ్చింది. దీంతో పాసులు తీసుకుని, ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు నగర శివారు పెందుర్తి నుంచి నగరంలోని ఆశీల్‌మెట్టకు రావాలంటే రెండు ఆటోలు మారి రూ.40 చెల్లించుకోవాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా దీక్షలు అవసరా అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు చేస్తున్న ఈ ధర్మపోరాట దీక్ష ఫలించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుందో లేదో తెలీదుకానీ, జనంలో ఉన్న కాస్త ప్రతిష్ట ఇటువంటి చర్యలతో మసకబారుతోందనిపిస్తోంది.