విశాఖ

భయాందోళన కలిగించిన వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, మే 24: ఉరుములు, మెరుపులతో వాతావరణం భయాందోళన కలిగించింది. గురువారం సాయంత్రం దట్టమైన మబ్బులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఉరుములు, మెరుపులతో కోటవురట్లలో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అలాగే జల్లూరు,గ గొట్టివాడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది.

మన గ్రామం- మన విశాఖ కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించుకోండి
మాకవరపాలెం, మే 24: మన గ్రామం- మనవిశాఖ కార్యక్రమంలో గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీడీ ఓ ఉదయశ్రీ అన్నారు. గురువారం మండలంలోని యరకన్నపాలెం గ్రామంలో అధికారులు మన గ్రామం - మనవిశాఖ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం , రేషన్ డిపోలో రికార్డులను తనిఖీ చేసారు. అనంతరం రామాలయం వద్ద నిర్వహించిన గ్రామసభలోత గ్రామస్తులు తాగునీటి పథకం, బోర్లు ఉన్నా తాగునీరు సరిపోవడం లేదని అధికారులకు ఫిర్యాదు చేసారు. దీనిపై ఎంపీడీ ఓ మాట్లాడుతూ తాగునీరు సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ఈకార్యక్రమం ఏర్పాటు చేసిందని ఏమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో ఇ ఓ ఆర్‌డీ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి పనులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు

మాకవరపాలెం, మే 24: మండలంలోని దాలింపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను విజిలెన్స్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా రాష్ట్ర ఛీప్ విజిలెన్స్ అధికారి విశ్వనాధం, జిల్లా విజిలెన్స్ అధికారి చంద్రకళ చెరువులో మట్టి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. పనులు చేయడం వలన రోజుకు ఎంత వేతనం వస్తుంది, కూలీలకు టెంట్లు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలు అందుతున్నదీ, లేనిదీ వారు కూలీలను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. మజ్జిగ సరఫరా చేయడం లేదని కూలీలు వారికి తెలిపారు. అనంతరం విజిలెన్స్ అధికారులు ఉపాధి కార్యాలయంలో ఈ ఏడాది మంజూరైన పనులు , వాటి ఖర్చులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసారు. ఈకార్యక్రమంలో ఉపాది పధకం ఎపీడీ శ్రీనివాస్‌కుమార్, ఎంపీడీ ఓ ఉదయశ్రీ, ఎపీ ఓ డీవీ యరకయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.