విశాఖ

ఫైబర్ గ్రిడ్ కనెక్షన్‌ల కేటాయింపులో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, మే 24: ఫైబర్ గ్రిడ్ కనెక్షన్‌ల కేటాయింపులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.వి.ఎస్.ప్రకాష్ ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కేబుల్ ప్రసారాలు అందిస్తున్న వారిని కాదని కొత్తవారికి గ్రిడ్ కనెక్షన్‌లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. మండలంలోని ఎం.కోడూరు గ్రామంలో గత ఇరవై సంవత్సరాలకు పైగా కెబుల్ ప్రసారాలు అందిస్తున్న వారిని కాదని వేరే వారికి గ్రిడ్ కనెక్షన్ కేటాయించడం అన్యాయమని ఆయన అన్నారు. దీనివలన కెబుల్‌పై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆయన చెప్పారు. ఏన్నో సంవత్సరాలుగా కెబుల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికే ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ సదుపాయాన్ని కల్పించాలని, డమీ ఆపరేటర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ విషయమై తమ సంఘం ద్వారా తీర్మానం చేసి సంబంధిత అధికారులకు పంపినట్టు ఆయన చెప్పారు.
విస్తృతంగా వాహన తనిఖీలు
కొయ్యూరు, మే 24: ఎ ఓబీలో మావోయిస్టుల కదలికల నేపధ్యంలో స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. మారుమూల ప్రాంతాల్లో జనమైత్రి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మావోయిస్టుల ఆచూకీకై ప్రధాన కూడళ్ళలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. కొయ్యూరు ఎస్సై రుక్మంగధరరావు ఆధ్వర్యంలో కాకరపాడు జంక్షన్, స్టేషన్ల సముదాయం వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మంప ఎస్సై ఆధ్వర్యంలో మంప, రేవళ్ళు రూట్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలను, ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించి వదులుతున్నారు. వాహనదారులంతా విధిగా రికార్డులు కలిగి ఉండాలని, హెల్మెట్లు తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తూ అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

ఉపాధి వేతనాలు అందడం లేదు
కోటవురట్ల,మే 24: సకాలంలో ఉపాధి వేతనాలు అందక తాము ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండలంలో చౌడువాడ గ్రామస్తులు నోడల్ బృందానికి ఫిర్యాదు చేసారు. మండలంలో చౌడువాడ గ్రామంలో గురువారం మన గ్రామం- మనవిశాఖ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉపాధి కూలీలు మాట్లాడుతూ పోస్ట్ఫాసు ద్వారా తమకు వేతనాలు సరిగా అందడం లేదన్నారు. వేతనాలు పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. దీనిపై సమావేశం నిర్వహించుకుని ఏవిధంగా వేతనాలు అందజేయాలో తమకు తెలియజేయాలని ఎడీవో కళ్యాణి సూచించారు. గ్రామ స్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి మన గ్రామం- మనవిశాఖ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పధకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని వలన వలసలను నిరోధించగలిగామన్నారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గ్రామ స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలన్నారు. ఈకార్యక్రమంలో ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు, పీ ఆర్ జె ఇ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.