విశాఖ

అరకులోయలో వడగళ్ల వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మే 24: అరకులోయలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. గత వారం రోజులుగా మబ్బులు కమ్మి ఊరిస్తున్న వర్షం గంటకు పైగా కుండపోత వర్షం కురవడంతో అరకులోయ చల్లబడింది. భారీ వర్షం వలన వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆహ్లాదకరంగా మారింది. వడగళ్ల వానకు ఈదురు గాలులు తోడవ్వడంతో స్థానికులు ఆందోళన చెందారు. భారీ వర్షం వలన పల్లపు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రధాన రహదారులు మీదుగా వర్షపు నీరు ప్రవహించింది. దీంతో వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతవాసులు వేసవి తాపంతో అల్లాడుతుండగా ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
గిరిజన యువత క్రీడల్లో రాణించాలి
అరకులోయ, మే 24: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కోరారు. మండలంలోని కొత్త్భల్లుగుడ పంచాయతీ పూజారిగుడ గ్రామంలో గురువారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగంలో రాణిస్తే మంచి గుర్తింపు లభిస్తోందని అన్నారు. ఏ వృత్తుల్లో ఉన్న యువతైనే, విద్యనభ్యసిస్తున్న విద్యార్థులైనా క్రీడల పట్ల ఆశక్తి పెంచుకుని రాణించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇందులో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఇంతవరకు ప్రోత్సాహం లేక కనుమరుగైన క్రీడాకారులు ప్రస్తుతం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దీనిపై మక్కువ పెంచుకుంటున్నారని సర్వేశ్వరరావు చెప్పారు. ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో 34 జట్లు పాల్గొంటుండగా పదిహేను రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. టోర్నీలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఎం.పి.పి. కె.అరుణకుమారి, వైస్ ఎం.పి.పి. పొద్దు అమ్మన్న, సర్పంచులు శెట్టి రాజులమ్మ, వంతాల పూర్ణ, దేశం నాయకులు శెట్టి బాబురావు, అప్పాలు తదితరులు పాల్గొన్నారు.