విశాఖ

విద్యార్థినికీ న్యాయం చేయాలని రిలే దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 24: ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగసత్య సాయి మూర్తి వేధింపులతో అన్యాయానికి గురైన గిరిజన విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం నాయకులు గురువారం స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్ష చేపట్టారు. బాధిత గిరిజన విద్యార్థినీతో కలిసి దీక్ష చేపట్టిన ఆందోళన కారులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేసారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు ఎం.ఎం.శ్రీను మాట్లాడుతూ ముంచంగిపుట్టు జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్‌మీడియట్ చదువుతున్న మఠం అశ్విని అనే గిరిజన బాలికను ప్రిన్సిపాల్ లైగింక వేధింపులకు గురిచేయడమే కాకుండా ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తన మాట విననందుకు అశ్విని పరీక్ష జవాబు పత్రాన్ని తారుమారు చేసి పరీక్ష ఫైయిలయ్యేందుకు కారణమయ్యారని ఆయన అన్నారు. అయితే విద్యార్థినీ పరీక్ష పత్రాన్ని తారుమారు చేయడంలో భాగస్వామ్యం ఉన్న ఇంటర్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవలసి ఉన్నా అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. గిరిజన బాలికను లైగింక వేధింపులకు గురిచేయడమే కాకుండా పరీక్ష జవాబు పత్రాన్ని తారుమారు చేసిన ప్రిన్సిపాల్‌తో ఇంటర్ అధికారులు, సిబ్బంది కుమ్మకయ్యారని ఆయన ఆరోపించారు. దీనివలన బాధిత విద్యార్థినీకి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పరీక్ష ఫైయిల్ కావడంతో సంవత్సర కాలాన్ని విద్యార్థినీ నష్టపోయిందని, విద్యార్థి దశలో విద్యా సంవత్సరం నష్టపోవడం ఆమెపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థినికి అన్యాయం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇందుకు సహకరించిన ఇతర అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైనదని ఆయన విమర్శించారు. ఈ విషయమై అధికారులు ఇప్పటికైనా స్పందించి పరీక్ష జవాబు పత్రాన్ని తారుమారు చేసిన ఇతర అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని, బాధిత విద్యార్థినీకి న్యాయం చేయాలని శ్రీను డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘం నాయకులు, బాధిత విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మూడో రోజుకు చేరిన తపాలా ఉద్యోగుల సమ్మె
అరకులోయ, మే 24: కమలేష్ చంద్ర కమిటి సూచించిన సిఫార్సులను అమలు చేసి, ఏడో వేతన సవరణ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తపాలాశాఖ ఉద్యోగులు చేపట్టిన నిరవదిక సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. అఖిల భారత డాక్ సేవా యూనియన్, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాల పిలుపు మేరకు ఈ నెల 22వ తేది నుంచి సమ్మెకు దిగిన ఉద్యోగులు మూడో రోజు కూడా సమ్మెను కొనసాగించారు. అరకులోయ, అరకు ఆర్.ఎస్. తపాలా కార్యాలయాల పరిధిలోని ఉద్యోగులు సమ్మె చేపడుతుండడంతో కార్యకలాపాలు పూర్తిగా స్థంబించిపోయాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన గిరిజన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు నిలిచిపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. అరకులోయ మండలంలో సుమారు 2 కోట్ల పది లక్షల రూపాయల చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇక్కట్లపాలవుతున్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు తమ అపరిష్క్రత సమస్యలను పరిష్కరించేంత వరకు నిరవదిక సమ్మెను కొనసాగిస్తామని తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు ఎస్.ఎస్.కుమార్, వెంకటరావు, ప్రసాదరావు, రాంబాబు చెప్పారు.