విశాఖపట్నం

వైసీపీలో చేరిన ‘ఎంవీవీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ గురువారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ లేదా ఉత్తర, తూర్పు నియోజకవర్గాల నుంచి ఎక్కడి నుంచైనా పోటీ చేయాల్సి వస్తుందని జగన్ ఎంవీవీకి సూచించినట్టు తెలిసింది. అయితే, వెలగపూడిపై పోటీ చేయడానికి సత్యనారాయణ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆయన విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయడానికే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కావల్సిన అర్థ, అంగబలాన్ని సిద్ధం చేకోవలసిందిగా పార్టీ ఆదేశించినట్టు తెలిసింది.