విశాఖపట్నం

విశాఖ పోర్టులో పర్యటించిన నేపాల్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 24: విశాఖ పోర్టులో నేపాల్ బృందం గురువారం పర్యటించింది. నేపాల్‌కు చెందిన నేపాల్ సైడ్ ఎమినెంట్ పర్సన్ గ్రూప్ మెంబర్ డాక్టర్ రాజన్ భట్టారి, ఇండియన్ సైడ్ ఎమినెంట్ పర్సన్ గ్రూప్ మెంబర్ పీ.లామ, నేపాల్ పొలిటికల్ ఎంబసీ కౌన్సిలర్ హరి ప్రసాద్, ఈపీజీ మెండమర్ ఎస్.రాయ్ ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందానికి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు స్వాగతం పలికారు. పోర్టులోని వౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ తీరును చైర్మన్ ఈ బృందానికి వివరించారు. విశాఖపట్నం పోర్టులో వౌలిక హ్లాండ్లింగ్ చార్జిలు తక్కువగా ఉన్నాయన్న విషయాన్ని ఆయన ఆ బృందానికి తెలియచేశారు. నేపాల్ ట్రేడ్‌ఫేర్‌లో విశాఖపట్నం పోర్టుపై జరిగిన చర్చలో ఈ పోర్టుపై నేపాల్ ప్రభుత్వం విశ్వసనీయతను ప్రకటించడం పట్ల చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్టులో నేపాల్‌కు చెందిన లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని చైర్మన్ సూచించారు. భారత్, నేపాల్‌ల మధ్య జల రవాణా విషయంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దశాల నుంచి ఇద్దరు చొప్పున ఒక కమిటీగా ఏర్పాటు చేస్తే బాగుటుందని డాక్టర్ రాజన్ భట్టారి సూచించారు. పీ.లామా మాట్లాడుతూ నేపాల్, భారత్‌తో మెరుగైన వాణిజ్య సంబంధాలను కొనసాగించాలని భావిస్తోందని అన్నారు. కార్గో హ్యాండ్లింగ్, రవాణాలో జాప్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ మేసేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ బృందానికి సూచించారు.