ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. విశాఖ సీపీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదమేర్పడిందన్నారు. ఇటీవల నలుగురు న్యాయమూర్తులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మీడియా సహయంతో జనంలోకి రావడమే నిదర్శనమన్నారు. నీతి అయోగ్, ఆర్‌బీఐ వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నారు. చట్టపరమైన హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. చివరకు రాష్టప్రతి కూడా ప్రధాని మోదీ చెప్పుచేతల్లో నడచుకోవడం దారుణమన్నారు. నల్లధనాన్ని 50 రోజుల్లో వెనకు రప్పిస్తానని, లేనిపక్షంలో కాల్చి చంపాలన్న మోదీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. నోట్ల రద్దు అనంతరం రూ.2000 నోటు తీసుకురావడం ద్వారా నల్లధనం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కర్నాటక ఎన్నికల్లో రూ.11,500 కోట్లు ఖర్చయిందని ఆరోపించారు. మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాలన్నీ ఢిల్లీకి చేరుకుంటున్నాయన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట పార్టీలను ఏకం చేయడం బూటకమన్నారు. ప్రధాని మోదీని చంద్రబాబునాయుడు వ్యతిరేకించడంతో రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.