విశాఖపట్నం

భద్రత మధ్య తరలిన సింహాచలేశుని వెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూన్ 17 : శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో నిరుపయోగంగా ఉన్న వెండి కరగదీతకు హైదరాబాద్‌లో ప్రభుత్వ మింట్‌కి తరలించారు. ఏఆర్ భద్రతా దళాలతో పాటు ప్రత్యేక వాహనంలో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనంలో సింహగిరి నుండి ఒక వెయ్యి ముప్పై ఒక కిలోల ఏడు వందల ఏభై గ్రాముల వెండిని పెట్టెల్లో పెట్టి తరలించారు. ఈవో కె.రామచంద్రమోహన్ అర్చక పరివారం వాహనానికి పూజలు చేసి సాగనంపారు. దేవస్థానం సహాయ కార్యనిర్వాహణాధికారి ఇజ్జురోతు శ్రీనివాసరావు, సూపరెంటెండెంట్ రమణమూర్తి, గుమస్తా సూర్యనారాయణ, దేవస్థానం అప్రైజర్ సాంబమూర్తి వెంట వెళ్లారు.
బిగ్‌బాస్కెట్‌లో 43 మందికి ఉద్యోగాలు
* నియామకపు ఉత్తర్వులు అందజేసిన ఎంపీ
విశాఖపట్నం, జూన్ 17: ‘బిగ్ బాస్కెట్’ సంస్థ డెలివరీ ఎగ్జిక్యుటివ్ పోస్టులకు 43 మంది ఎంపికైనట్టు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఎంపీ కార్యాలయం అవరణలో ఆదివారం జరిగిన ఎంపిక ప్రక్రియలో వీరికి నియామకపు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్‌బాస్కెట్ కంపెనీ దేశవ్యాప్తంగా పలు శాఖలతో సాలీనా రూ.1000 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోందన్నారు. సంస్థలో డెలివరీ సిబ్బందికి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సదుపాయాలతో కూడిన ఆకర్షణీయమైన జీతాలు చెల్లిస్తున్నారన్నారు. అలాగే కుటుంబీకులకు చదువు నిమిత్తం రూ.40 వేలు రుణ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. సమావేశంలో సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ రేవతి, ప్రతినిధులు హర్ష రవితేజ, తిరుపతి రావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు.