విశాఖపట్నం

నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: నగరం నిప్పుల కొలిమిగా మారింది. నాలుగు రోజులుగా మండుతున్న ఎండలు, ఆదివారం నాటికి మరింత ఉగ్రరూపును సంతరించుకున్నాయి. గురువారం 40 డిగ్రీలుగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం నాటికి 41.4 డిగ్రీలకు చేరి రికార్డు సృష్టించాయి. ఈ వేసవికి ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ పేర్కొంది. సూర్యోదయంతోనే మొదలైన సూర్య ప్రతాపం మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరుకుంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టు అనిపించింది. తీరంలో ఎప్పుడూ కాస్త చల్లగా ఉండే వాతావరణం కాస్తా అగ్నిగుండాన్ని తలపించింది. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు కన్పించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎంత త్వరగా ఇళ్లకు చేరుదామా అనే ఆత్రుత పడ్డారు. గ్రీష్మతాపానికి నగరంలోని రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే మద్దిలపాలెం, ఆశీల్‌మెట్ట, జగదాంబ, హనుమంతవాక తదితర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి.
జూలో మూగజీవాల విలవిల
నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో మూగజీవాలకు ఈ వేసవి పెద్ద సవాలుగా నిలిచింది. గత నాలుగు రోజులుగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలకు జూలో జంతువులు విలవిల్లాడుతున్నాయి. గత మూడు రోజులుగా 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జంతువులకు సిబ్బంది సపర్యలు చేస్తున్నారు. ఎండ వేడిమి నుంచి రక్షించేందుకు నీటితో సేదతీరే విధంగా సపర్యలు చేస్తున్నారు. ఎండ నుంచి రక్షణకు జంతువులు ఎన్‌క్లోజర్లలోకి వెళ్లిపోగా, సందర్శకులు నిరీక్షిస్తున్నారు. ఇక సందర్శకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎండలకు తాళలేక చెట్లకింద సేదతీరుతున్నారు.