విశాఖ

27 అర్ధరాత్రి నుంచి చేపల వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: ఎట్టకేలకు మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. చేపల వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు ఇచ్చే సబ్సిడీ పెంచకపోవడంతో ఈనెల 15వ తేదీ నుంచి వేటకు వెళ్లకుండా బోట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ విషయమై ప్రభుత్వంతో చర్చించేందుకు విశాఖ నుంచి వైశాఖ డాల్ఫిన్ బోట్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, కోస్టల్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకుడు బరికొండబాబు, ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు పీసీ అప్పారావు, కాకినాడ, నిజాంపట్నం నుంచి బోట్ ఓనర్స్ ప్రతినిధులు తదితరులు వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో చర్చించినట్టు నత్యనారాయణ మూర్తి చెప్పారు. ఈ సబ్సిడీ సమస్య నాలుగు సంవత్సరాల నుంచి ఉందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే, చేపల వేటకు వెళ్లలేమని చెప్పారు. వెంటనే యనమల ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినట్టు మూర్తి తెలిపారు. ఈ సబ్సిడీ వలన ప్రభుత్వంపై 85 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా, సబ్సిడీ ఇచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని యనమల హామీ ఇచ్చారని సత్యనారాయణ మూర్తి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెపథ్యంలో లీటర్ డీజిల్‌కు సుమారు 12 రూపాయల సబ్సిడీ వస్తుందని, ఇది బోట్ ఓనర్స్ సాధించిన విజయమని ఆయన చెప్పారు. వెంటనే బోట్లను వేటకు సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈనెల 26వ తేదీన గంగమ్మతల్లి జాతర నిర్వహించనున్నామని, 27 అర్థరాత్రి 12 గంటలకు బోట్లను వేటకు పంపాలని నిర్ణయించామని ఆయన తెలియచేశారు. 27 అర్థరాత్రి నుంచి రాష్టవ్య్రాప్తంగా 1500 బోట్లు వేటకు వెళ్లనున్నాయి.
కాగా, బోట్లలో పనిచేసే క్రూ (సిబ్బందికి) చేపల వేటలో ఇప్పుడు ఇస్తున్న వాటాల్లో మార్పులు చేయబోతున్నామని సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. పై మూడు సంఘాలు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలియచేశారు. చేపల వేటకు వెళ్లిన క్రూ తీసుకువచ్చిన చేపల్లో కొన్ని మేలు రకాల చేపలను వేరే చేసి, అవి విక్రయించగా వచ్చిన మొత్తంలో 10 శాతం వాటాను క్రూకు ఇస్తున్నామని చెప్పారు. కానీ, ఇకపై అలా ఉండదని అన్నారు. వేటలో దొరికిన అన్ని రకాల చేపలను బోటుల ఉంచిన ఐస్ బాక్స్‌లో ఉంచుతారు. ఇలా ఉంచిన అన్ని రకాల చేపలను విక్రయించి, వచ్చిన మొత్తంలో 10 శాతం ఇవ్వడానికి మూడు సంఘాలు నిర్ణయించాయని సత్యనారాయణ మూర్తి తెలియచేశారు. అలాగే వేట సాగినప్పుడు దొరికిన కొన్ని చేపలను బోటు పైన ఆరబెడతారు. అలా వచ్చిన డ్రై ఫిష్‌లో 80 శాతం క్రూకు ఇవ్వనున్నామని ఆయన తెలియచేశారు. కాకినాడ హార్బర్‌లో మత్స్యకారులు తీసుకువచ్చిని డ్రై ఫిష్‌లో 50 శాతం మాత్రమే క్రూకి ఇస్తున్నారని ఆయన చెప్పారు. దీనివలన బోటు ఓర్లకు నష్టం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఈ వాటాలకు అంగీకరించి క్రూ ముందుకు వస్తే, బోట్లు నడుపుతామని, లేకుంటే నిలిపివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాదైనా వేటసాగేనా!
గత ఏడాది సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఒక్కో బోటు వేటకు వెళ్లాలంటే, రెండు నుంచి మూడున్నర లక్షల రూపాయలు బోటు యజమానులు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. చేపల వేట సవ్యంగా సాగకపోవడంతో గత ఏడాది నవంబర్ నుంచే రాష్ట్రంలో అన్ని హార్బర్లలో చేపల వేటను నిలిపివేశారు. కేవలం చేపల వేటపైనే జీవనం సాగించే మత్స్యకారులు రోడ్డున పడాల్సి వచ్చింది. కనీసం ఈ సంవత్సరమైనా వేట బాగుండాలని మత్స్యకారలు కోరుకుంటున్నారు.