విశాఖ

రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 19: విశాఖ ఏజెన్సీలోని రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాలను గుర్తించి రోడ్డు మ్యాప్‌లను సిద్ధం చేయాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులకు రహదారుల నిర్మాణాలకు అవసరమైన రోడ్డు మ్యాప్ రూపకల్పనపై మంగళవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామంపై ఇంజనీరింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు. ఏజెన్సీలో రహదారులు ఉన్న గ్రామాలు, కనీస రోడ్డు సదుపాయం లేని గ్రామాల గుర్తింపును తక్షణమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రహదారుల స్థితిగతులను కూడా గుర్తించి నివేదిక తయారు చేయాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలోని ఏ ఏ గ్రామాలకు ఎటువంటి రోడ్డు సదుపాయం ఉన్నదో గుర్తించాలని, గతంలో మంజూరు చేసిన రోడ్ల వివరాలను పొందుపరచాలని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీలో రోడ్ల గుర్తింపు, సౌకర్యాలపై సత్వరమే నివేదిక సమర్పించాలని రవిసుభాష్ ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ప్రాజెక్టుల ఇ.ఇ. సుధాకరరెడ్డి, జగదీశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళీ, రాజు, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.