విశాఖ

పథకాలు లబ్దిదారులకు సక్రమంగా అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: ఉజ్వల యోజన, జన్‌ధన్ యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ సెక్రటరీ పురుషోత్తంతో కలిసి పౌర సరఫరాలు, చములు సంస్థల ప్రతినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉజ్వల యోజన పథకం కింద అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు, సిలెండర్లు అందేలా చూడాలన్నారు. ఏజెన్సీ మండలాల్లో అర్హులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని అయితే 5 కిలోల గ్యాస్ సిలెండర్లు సకాలంలో వారికి అందేలా చూడాల్సిన బాధ్యత చమురు సంస్థల యాజమాన్యాలు, పౌర సరఫరాల శాఖ అధికారులపై ఉందన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద అర్హులకు ఎటువంటి డిపాజిట్ లేకుండా ఖాతాలు తెరిపించాలన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద ఖాతాలు తెరిచేందుకు రూ.1000 డిపాజిట్ డిమాండ్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, కార్యదర్వి పురుషోత్తం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా కనీస డిపాజిట్ పేరిట ఖాతాలు తెరిచేందుకు నిరాకరించే బ్యాంకు మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. కేంద్ర పథకాల అమల్లో యాస్పిరేషనల్‌గా విశాఖ జిల్లాను గుర్తించిన నేపథ్యంలో గ్రామ స్వరాజ్ అభియాన్ పథకాలను గుర్తించిన ఎనిమిది క్లస్టర్లలో పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ప్రతి క్లస్టర్‌కు ఒక సమన్వయ అధికారిని నియమించాలన్నారు. అలాగే నీతి అయోగ్ జిల్లా ప్రణాళిక ప్రకారం జిల్లాలో విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, వృతి నైపుణ్యత, వ్యవసాయం తదితర కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు సెక్టార్ల వారీగా నోడల్ అధికారులను నియమించామని కలెక్టర్ వివరించారు. సమావేశంలో సీపీఓ రామశాస్ర్తీ, డీఎస్‌డీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.