విశాఖ

రాహుల్ నాయకత్వానికి ప్రజాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:్భరత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో రాహుల్ జన్మదిన కార్యక్రమం మంగళవారం జరిగింది. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ విజయాల బాట పట్టిస్తున్నారన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ త్యాగాల కుటుంబాల నుంచి వచ్చిన రాహుల్ కాంగ్రెస్ ఆశాజ్యోతి అన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం, రాహుల్ గాంధీని జాతీయ పార్టీ అధ్యక్షునిగా మంచి విజయాలు నమోదు చేస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజదరణ పెరుగుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ఈ అంశంపై ఇప్పటికే రాహుల్ స్పష్టతనిచ్చారన్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతున్నారన్నారు. అంతకు ముందు కార్యాలయంలో రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, వుడా మాజీ అధ్యక్షుడు పీఎస్‌ఎన్ రాజు, పీసీసీ కార్యదర్శి గొంప గోవిందరాజు, పీసీసీ మత్స్యకార విభాగం అధ్యక్షుడు కంటుముచ్చు తాతారావు, కాంగ్రెస్ నాయకులు జగ్గుపల్లి అప్పలరాజు, గుత్తుల శ్రీను, గొంటు మోహనరావు, కొయ్య రామకృష్ణ, పీసీసీ నగర కాంగ్రెస్ శక్తి సంఘటన్ అధ్యక్షుడు కె గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

31వ వార్డులో కాంగ్రెస్‌తోనే సమర్ధ పాలన
దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో సమర్ధవంతమైన పాలన అందుతుందని నగర కాంగ్రెస్ శక్తిసంఘటన్ అధ్యక్షుడు కె.గోపాల్‌రెడ్డి అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 48వ జన్మదినోత్సవం సందర్భంగా సీతమ్మధార పాపా హోంలో చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పుంజుకుందన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి దేశంలో అధికారం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ఒక్కటే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పనిచేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆశయసాధనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వంలో సమష్టిగా పనిచేస్తూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తారన్నారు. రాహుల్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు బీ మధుర, పాపా హోం సిబ్బంది పాల్గొన్నారు.