విశాఖపట్నం

4న మండల స్థాయి పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ నుండి ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించిన సమ్మర్ రీడింగ్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్థులకు, గ్రంథాలయ పీతామహ అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా మండల స్థాయి./జిల్లా స్థాయి/జోనల్ స్థాయి/ పోటీలు ఎనిమిది అంశాలపై నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్-ఇన్‌చార్జ్ (విశాఖపట్నం) సృజన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్, వ్యాస రచన, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్-పెయింటింగ్, డాన్స్,డ్రామా, ఎలక్యూషన్-‘ద బుక్ దట్ ఐ హేవ్ రీడ్’ అనే అంశాలపై పోటీలు ఉంటాయి. వచ్చేనెల నాల్గవ తేదీన మండల స్థాయి పోటీలు వివిధ మండల కేంద్రాలు, శాఖా గ్రంథాలయాల్లో నిర్వహిస్తారన్నారు. అ లాగే జిల్లా స్థాయిలో వచ్చేనెల 11వ తేదీన ఉదయం 8 గంటలకు విశాఖలో గాజువాక శాఖా గ్రంథాలయంలో, జోనల్ స్థాయి పోటీలు వచ్చేనెల 18వ తేదీన విజయనగరంలో ఉంటాయన్నారు. పైన తెలిపిన పోటీల్లో మండల స్థారుూ పోటీల్లో గెలుపొందిన మొదటి శ్రేణి విజేతలైన విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా స్థాయిలో పోటీల్లో, జిల్లా స్థారుూ పోటీల్లో మొదటి, ద్వితీయశ్రేణి విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు జోనల్ స్థాయిలో (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) విజయనగరం జిల్లాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జోనల్ స్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు వచ్చేనెల 24వ తేదీన విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకుల్లో బహుమతి ప్రదానం చేయబడునన్నారు.