విశాఖ

బీకే పల్లి సంఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జూన్ 23: మండలంలో బీకేపల్లి సంఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి డిమాండ్ చేసారు. శనివారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బాధిత కుటుంబ సభ్యులు వివిధ ప్రజా సంఘాలతో మైనర్ బాలిక లోకేశ్వరి పరిస్థితి, కేసు విషయమై సమీక్షించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రభావతి మాట్లాడుతూ లోకేశ్వరి చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు ఆకుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ఇటువంటి కేసుల్లో దోషులకు సకాలంలో శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలపై హత్యాచారయత్నం, హత్యాయత్నం జరిగినప్పుడు పోలీసులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ ఫండ్ మంజూరు చేసి బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. నేరాన్ని బట్టి శిక్ష ఉండే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. మహిళా సాధికారతపై మాటలు కాకుండా చేతల్లో చూపించాలని ప్రభుత్వానికి సూచించారు. అశ్లీల చిత్రాలు, అశ్లీల సాహిత్యం నిరోధానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈసమావేశంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కేవీ ఎస్ ప్రభ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, సీపీ ఎం మండల కన్వీనర్ డేవిడ్‌రాజు, పాయకరావుపేట కన్వీనర్ కె.దాస్, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

వాహనం నడిపే ప్రతీ ఒక్కరికీ లైసెన్స్ తప్పని సరి
మాకవరపాలెం, జూన్ 23: వాహనం నడిపే ప్రతీ ఒక్కరికీ లైసెన్స్ తప్పని సరిగా ఉండాలని అనకాపల్లి ఆర్టీవో ఖాన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన లైసెన్స్ మేళాకు 100 మంది హాజరయ్యారు. ఈమేళాలో పైడిపాల, తామరం, బూరుగుపాలెం, తూటిపాల, మాకవరపాలెం గ్రామాలకు చెందిన వారికి రవాణా శాఖ అదికారులు ప్రత్యేక లైసెన్స్ మేళా నిర్వహించారు. లైసెన్స్ వారంతా దరఖాస్తు చేసుకుంటే అనకాపల్లి ఆర్టీవో కార్యాలయం ద్వారా ఎల్ ఎల్ ఆర్ అందించడం జరుగుతుందన్నారు. వీరికి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి అనంతరం ఎల్ ఎల్ ఆర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా తప్పని సరిగాలైసెన్స్ పొందాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం వలన ఫ్రమాదాలు అధికం అవుతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ఆర్ చిన్నయ్యమ్మ, ఎంపీడీ ఓ ఉదయశ్రీ, మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్, శివరామగోపాల్, అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్లు అచ్యుతకుమారి, సృజన పాల్గొన్నారు.