విశాఖ

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, జూన్ 23: మండలంలో కస్పాజగన్నాధపురం గ్రామంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎనిమిదోవ వార్షికోత్సవ ప్రతిష్టోత్సవ వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయ కమిటి వ్యవస్థాపక అధ్యక్షుడు రాపేటి రామకొండలరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం నుంచే ఆలయ ప్రదాన అర్చకుడు సుదర్శన్ ఆచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజలు చేసారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
తీరనున్న తాగునీటి సమస్య
మాడుగుల, జూన్ 23: మండలంలో వీరవిల్లి పంచాయతీ పరిధిలోని కొత్తూరు కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య తీరనుంది. ఈ కాలనీలో గత కొన్నాళ్లుగా మంచినీటి సమస్యతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కాలనీ గ్రామానికి చివరి ఉండడంతో మంచినీటి కోసం దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తూ అనేక సమస్యలు ఎదుర్కొనేవారు. తమ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతుండడంతో ప్రభుత్వం 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి పథకాన్ని నిర్మించారు. ఈ పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభోత్సవం కానుండడంతో నీటి సమస్య నుంచి కాలనీ వాసులకు విముక్తి కలగనుంది.
సమస్యల పరిష్కారానికి కృషి
మాడుగుల, జూన్ 23: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు చెప్పారు. మండలంలోని కస్పాజగన్నాధపురం గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ భవనానికి ఆయన శనివారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించడమే కాకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటకోట అప్పారావు, ఆలయ కమిటి అధ్యక్షుడు ఆర్.రామకొండలరావు, దేశం నాయకులు రాపేటి జోగినాయుడు, ఆళ్ల సంతోష్ శివ, ఎ.గాంధీ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.