విశాఖపట్నం

దళితతేజం విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 23: ఈ నెల 30న నెల్లూరులో నిర్వహించనున్న దళితతేజం సభను విజయవంతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సారధ్యంలో శనివారం జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. దళితతేజం సభను టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుందని, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులను తరలించాలని నిర్ణయించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులను తరలించాలని, అందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని ఇన్‌ఛార్జి మంత్రి చినరాజప్ప పార్టీ నాయకులను ఆదేశించారు. ఆలాగే రైల్వేజోన్ సాధనకు వచ్చే నెల 4న పార్టీ ప్రజాప్రతినిధులంతా నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబు, వాసుపల్లి గణేష్‌కుమార్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వర రావు, బండారు సత్యనారాయణ మూర్తి, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు ఎం మణికుమారి, ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌ఏ రెహ్మాన్, జీ సుమన, రజక కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి నారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఎండీ నజీర్, కే గోవిందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బుద్ద నాగ జగదీష్, చోడే పట్ట్భా తదితరులు పాల్గొన్నారు.