విశాఖ

కెకె లైన్‌లో పాక్షికంగా రైళ్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ వాల్తేరుడివిజన్ పరిదిలోకి వచ్చే భాన్సీ-కామాలూర్ స్టేషన్ల మధ్య కొత్తవలస-కిరూండల్ మార్గంలో గూడ్స్‌రైలు పట్టాలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా విశాఖపట్నం-కిరూండల్ (58501) పాసింజర్ కోరాపుట్ వరకే నిర్వహిస్తున్నట్టు డివిజన్ అధికారులు తెలిపారు. మళ్ళీ ఇది కోరాపుట్-విశాఖపట్నం (58502) మధ్య 24,25 తేదీల్లో నడువనుంది. ఈ రెండు రోజులుపాటు ఈ పాసింజర్ రైలు కోరాపుట్-కిరూండల్ మధ్య నడువదని తెలిపారు. విశాఖపట్నం-కిరూండల్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08512)గా జగదల్‌పూర్ వరకు మళ్లీ తిరిగి జగదల్‌పూర్-విశాఖపట్నంల (08511)ల మధ్య ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఈ రెండు రోజులపాటు కిరండూల్ మధ్య నడవదన్నారు. గూడ్స్ పట్టాలు తప్పిన కారణంగా సంఘటనాస్థలం వద్ద పునరుద్ధరణ పనులు యుద్దప్రాతిపదికన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించి తమతో సహకరించాల్సిందిగా సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జీ.సునీల్‌కుమార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

జాతీయ పతాకాన్ని స్మరించుకుందాం

విశాఖపట్నం, జూన్ 24: జాతీయ పతాకాన్ని స్మరించుకోవడం ద్వారా జాతి సమగ్రతకు జీవం పోద్దామని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగా జాతీయ పతాకాన్ని స్మరించుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. స్థానిక పూర్ణామార్కెట్ సమీపంలోని దుర్గాలమ్మ గుడి వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రతి నెలా చివరి ఆదివారం జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, పతాకం ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించే బాధ్యత ప్రస్తుత తరం తీసుకోవాలన్నారు. ఏఐసీసీ ఈ బాధ్యతను కాంగ్రెస్ సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించడం ముదావహమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జనలో జాతీయ పతాకం కీలకపాత్ర పోషించిందన్నారు. జాతీయ పతాకాన్ని చేతబట్టి స్వతంత్ర సమరయోధులు ఆంగ్లేయులను ఎదిరించి పోరాడారన్నారు. అదే స్ఫూర్తితో దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్న మతోన్మాద బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సేవాదళ్ కోఆర్డినేటర్ బీ గంగాధర రావు సారధ్యం వహించగా కాంగ్రెస్ ప్రతినిధులలు గౌరీ శంకర్, ఆలేటి హేమలత, కన్నతల్లి, రాము, కె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా సేవాదళ్ కోఆర్డినేటర్ గంగాదర్ తెలిపారు.