విశాఖపట్నం

జోన్‌పై పవన్ వైఖరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: జనసేన అథినేత పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రి నగరానికి చేరుకోనున్నారు. బీచ్ రోడ్డులోని ఓ రిసార్ట్‌లో ఆయన బస చేస్తారు. 26, 27 తేదీల్లో ఆయన అక్కడే ఉండి, వివిధ వర్గాల ప్రజలతో ఆయన జిల్లా సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విశాఖకు మంజూరు చేసిన విద్యా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, విశాఖ రైల్వే జోన్‌తోపాటు పెండింగ్ ప్రాజెక్ట్‌లపై ఆయన అధ్యయనం చేయనున్నారు. విశాఖ ప్రజల సెంటిమెంట్ అయిన రైల్వే జోన్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయన సేకరించనున్నట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఉద్దానం సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పవన్ రెండు రోజులపాటు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో విశాఖ రైల్వే జోన్‌పై కూడా పవన్ ఒకటి, రెండు రోజులు దీక్ష చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఈనెల 28వ తేదీ నుంచి జిల్లాలో పోరాట యాత్రలో పాల్గొననున్నారు. మొదట చోడవరం, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో పోరాట యాత్ర నిర్వహించనున్నారు. 29న భీమిలి నుంచి పోటీ యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. విశాఖ జిల్లాలో పర్యటన పూర్తయిన తరువాత పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.