విశాఖ

తప్పు చేస్తే నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, జూలై 15: ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీటిక్కెట్‌తో ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అధికార టీడీపీ శాసనసభ్యునిగా నాలుగేళ్లు పదవీకాలం పూర్తిచేసిన సందర్భంలో కూ డా అలాగే ఉన్నానని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానికంగా జరిగిన పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పైవిధం గా మాట్లాడారు. తనలో ఎటువంటి మార్పులేదు. తాను ఏమైనా తప్పులు చేసినట్లు ఉంటే తన విజయం కోసం చిత్తశుద్ధితో కృషిచేసిన పార్టీ కార్యకర్తలు బాహాటంగానే నిలదీసే అధికారం వారికి ఉంది. అందుకు తాను ఎల్లవేళలా జవాబుదారిగానే ఉంటానన్నారు. పట్టణ దేశం పార్టీ నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నారాయణరావు నేతృత్వంలో తొలిసారిగా పట్టణ కార్యకర్తల సమావేశం ఆదివారం స్వగృహంలో జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలు తమకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి సొంతపనులు జరగడం లేదని, ఎమ్మెల్యేగా ఎవరు అధికారంలోకి వచ్చినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉందని, ఆన్‌లైన్‌లో సంక్షేమపథకాలు అమల్లోకి రావడం వలన తమ వార్డు ప్రజలకు ఏ పథకాలు అందుతున్నాయో తమకు తెలియలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని పేర్కొం టూ తీవ్ర నిరాశ నిస్పృహను వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే పీలా పైవిధంగా స్పందించారు. ప్రజలతో, పార్టీతో మమైకమై పనిచేస్తున్నానని కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నానన్నారు. ఉద్యోగనియామకానికి సైతం కార్యకర్తలకే సముచిత స్థానం కల్పించానని వివరణ ఇచ్చారు. త్వరలో జరగనున్న నామినేటెడ్ పదవుల పంపిణీలో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే జరుగుతుందని, తన వ్యక్తిగత భావాలను జోడించబోనని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది కార్యకర్తలు తన పట్ల అపార్ధంగా వ్యవహరిస్తున్నారని, తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. తాను తప్పుచేస్తున్నట్లు ఉంటే నేరుగా తనను నిలదీయవచ్చునని, తప్పుజరిగి ఉంటే అందుకు సంజాయిషీ చెప్పుకునే సంస్కారం తనకు ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల కంటే అనకాపల్లిలోనే ఎక్కువగా అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలు కాంట్రక్ట్ పనులు కావాలనుకుంటే గ్రామాల్లో జరిగే పనులను అప్పగిస్తానని, జివిఎంసి పరిధిలో కాంట్రాక్ట్ పనులు కేటాయింపు పూర్తిగా ఆన్‌లైన్‌కే పరిమితమై సాగుతున్నాయన్నారు. ఈ విషయంలో తనను అపార్ధం చేసుకోవద్దన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. కార్యకర్తలు సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.