విశాఖ

రహదారుల అబివృద్ధికి రూ. 800 కోట్లు నాబార్డు నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూలై 15: రాష్ట్రంలో రహదారుల అభివృద్ది, మరమ్మతులకు 800 కోట్ల రూపాయలు నాబార్డు సంస్థ నుండి రుణంగా తీసుకువచ్చామని రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆదివారం ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొదటి విడతగా రూ.346 కోట్లతో 108 పనులు 434 కిలో మీటర్ల మేర చేపట్టనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఐదువేల కిలోమీటర్ల పంచాయతీ రహదారులను అర్ అండ్‌బి శాఖకు బదిలీ చేశామన్నారు. వాటిలో 1,500 కిలో మీటర్లు ఇప్పటికే రోడ్లు వేశారన్నారు. జిల్లాలో ఐదు పనులకు 21.75 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాకు రూ.32 కోట్లు, చిత్తూరు జిల్లాకు రూ.36.55 కోట్లు, తూర్పుగోదావరి రూ.37.55 కోట్లు, గుంటూరు రూ.32.38 కోట్లు, కృష్ణా రూ.43.41 కోట్లు, కర్నూల్ రూ.42.35 కోట్లు, ప్రకాశం రూ.10.40 కోట్లు, నెల్లూరు రూ. 9.85 కోట్లు , శ్రీకాకుళం రూ.23.29 కోట్లు , విజయనగరం రూ.19.85 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ. 24.50 కోట్లు చొప్పున కేటాయించినట్లు వివరించారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం, సీతన్నఅగ్రహారం రోడ్లు అభివృద్ధికి రూ. 20 లక్షలు, నర్సీపట్నం - తుని ఆర్ అండ్‌బి రోడ్డు నుండి మన్యపురట్ల రోడ్డుకు రూ. 21 లక్షలు, పీపీ అగ్రహారం-మధువాడ రోడ్డుకు రూ. 28 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
* మహిళలకు రుణ మాఫీ చేశాం
అర్హత కలిగిన డ్వాక్రా మహిళా సంఘాలన్నింటికీ ఎనిమిదివేల రూపాయలు వంతున పంపిణీ చేశామని, మిగిలిన రెండువేల రూపాయలు ఆగస్టులో అందజేస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. 2014 సంవత్సరానికి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మాఫీ చేశామన్నారు. వివిధ కారణాల వలన కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. రివాల్వింగ్ ఫండ్ సక్రమంగా వినియోగించుకోలేక డిఫాల్ట్ అయిన వారు, ఆధార్ నెంబర్ సక్రమంగా అప్‌లోడ్ చేయని వారు, రెండు సంఘాల్లో ఉన్న వారు మాత్రమే రుణమాఫీ పొందలేక పోయారని తెలిపారు.

మంత్రి ఇంటి ముట్టడికి
ప్రయత్నించిన మధ్యాహ్న భోజన నిర్వాహకులు
* సమస్య పరిష్కారానికి మంత్రి హామీ
నర్సీపట్నం, జూలై 15: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరశిస్తూ ఆదివారం రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈసమాచారం ముందుగా తెలుసుకున్న పోలీసులు మంత్రి ఇంటివద్ద మోహరించారు. మంత్రి నివాసంలోకి నిర్వాహకులు వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు, మధ్యాహ్న భోజన కార్మికుల మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రిని కలిసేందుకు పోలీసులు నిరాకరించడంతో కార్మికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను రోడ్డున పడేయడం సరైంది కాదన్నారు. స్వలాభం కోసమే నవ ప్రయాస్ సంస్థకు ఈపథకం నిర్వహణ అప్పగించారన్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెట్టామన్నారు. ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి కార్మికులను యథావిధిగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, వేతనాలు తక్షణమే చెల్లించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వాహకులను లోపలికి పంపించాలని పోలీసులను ఆదేశించారు. ఈసందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడికి ప్రసన్న వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి వారితో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.