విశాఖ

చోడపల్లిలో మరో డెంగ్యూ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, జూలై 17: చోడపల్లిలో రోజురోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం వడిశల మీనా ( 11 )కు డెంగ్యూ లక్షణాలు కల్గి ఉండటంతో విశాఖపట్నం కెజీహెచ్‌కు తరలించారు. జ్వరాలు అదుపులోనికి రాకపోవడంతో ప్రజలు బేంబేత్తిపోతున్నారు. ఇప్పటికే వడిశల అప్పారావు యువకుడు డెంగ్యూ జ్వరంతో చనిపోగా, బండి రాజేష్, లావేటి కావ్యశ్రీ, వడిశల మంజు, మరో యువకుడు కెజీహెచ్‌లో చికిత్సపొందుతున్న సంఘతి తెల్సిందే. జ్వరాల భారిన పడి గ్రామస్తులు అల్లాడుతుపోతున్నారు. దీంతో బయపడి కొంత మంది గ్రామం వదిలి బంధువుల ఇంటికి వెళ్లిపోతున్న సంఘటనలో ఉన్నాయి. గత వారం రోజులగా వైద్యశిభిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా వైద్యాధికారులు కూడ గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కాని ఎక్కడ కూడ పరిస్థిలు అదుపులోనికి రావడంలేదు. పంచాయితీ అధికారులు గ్రామంలో చెత్తా, చదారాలను ట్రాక్టర్‌ల ద్వారా తరలించారు. కాలువలను, డ్రేనేజ్‌లను శుభ్రం చేశారు. కాని జ్వరాలు అదుపులోనికి రావడంలేదు. జిల్లా అధికారులు స్పందిచి మెరుగైన వైద్యశిభిరాలను ఏర్పాటు చేసి గ్రామస్తులందరికి వైద్యసేవలు అందించాలని గ్రామస్తులు డిమాండు చేశారు.
రగ్బీ జాతీయ పోటీలకు ప్రశాంతి పాలిటెక్నికల్ విద్యార్థిని ఎంపిక
అచ్యుతాపురం, జూలై 17: రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు స్థానిక ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మేనక ఎంపికైనట్టు సంస్థ డైరక్టర్ ధర్మిరెడ్డి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలకు చెందిన విద్యార్థిని మేనక రగ్బీ ప్రతిభ చూపించి ఈ నెల 14, 15 తేదిలో కృష్ణా జిల్లా మంచిలీపట్నంలో జరిగిన పోటీల్లో రాష్టస్థ్రాయిలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి ఆటలో ప్రతిభ చూపి జాతీయజట్టుకి ఎంపికైందన్నారు. ఈ నెల 24, 25 తేదిల్లో మధురైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు తరుపున మేనక ఎంపికైనట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రగ్బీ సంఘ కార్యదర్శి రామాంజనేయులు, కళాశాల చైర్మన్ ధర్మిరెడ్డి ప్రసాద్ తదితరులు అభినందించారు.