విశాఖ

ఎట్టకేలకు తంగేడు డైవర్షన్ రోడ్డు పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల,జూలై 17: ఎట్టకేలకు తంగేడు డైవర్షన్ రోడ్డు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. నర్సీపట్నం - రేవుపోలవరం రహదారిలో గల ఈ వంతెన దెబ్బతినడంతో జూన్ ణెలాఖరు నుంచి దీనిపై వాహనాల రాకపోకలు నిషేధించారు. అర్ అండ్‌బీ ఉన్నతాధికారులు మొదట డైవర్షన్ రహదారిని నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని భావించారు. అయితే అంచనా పెరగడంతో టెండర్లు పిలిచారు. ఈటెండర్‌లో జల్లూరు వంతెన నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ సుబ్బరాజుకు దక్కింది. దీంతో పనులు ప్రారంభించి 10 రోజుల్లో డైవర్షన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు.
శ్రీవరిపై అవగాహన
కోటవురట్ల, జూలై 17: తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులను శ్రీవరి విధానం ద్వారా సాధించవచ్చని మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ తెలిపారు. మంగళవారం కోటవురట్లలో మళ్ళ వెంకటరమణ పొలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీవరి నాట్లు వేసే విధానాన్ని, సాగుపై అవగాహన కల్పించారు. ఎకరం పరిధిలో రెండు కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. 8 నుంచి 14 రోజుల వయస్సుగల నారును నాటాల్సి ఉంటుందన్నారు. నాటే ముందు చివర్లను తుంచాలన్నారు. మొక్కకి, మొక్కకి 25 సెంటీ మీటర్ల దూరం పాటించాలన్నారు.

వరినారు మడులపై రైతులకు అవగాహన
గొలుగొండ, జూలై 17:ఖరీప్ సీజన్‌లో రైతులు వరి నారు మళ్ళుపై వ్యవసాయాదికారులు, సూచనలు తప్పని సరిగా పాటించాలని వ్యవసాయాదికారి మధుసూధనరావు అన్నారు. మంగళవారం మండలంలోని జమ్మాదేవిపేట గ్రామ రైతులతో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వ్యవసాయ క్షేత్రాల ద్వారా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా వ్యవసాయాధికారి మధుసూధనరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీప్‌కు అనుకూలమైన వరి నారు మడులను రైతులను సిద్ధం చేసుకున్నారన్నారు. మరో వారం 10 రోజుల్లో వరినాట్లువేయనున్నారని దీంతో వరినారు మడుల్లో ఆకుముడత తెగులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు రైతులు వ్యవసాయాధికారులు సూచనలు పాటిస్తే ఖరీప్‌లో నాట్లు వేసేటప్పుడు ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికే మండలంలోని ప్రతీ గ్రామ రైతులతోనూ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో జమ్మాదేవిపేట గ్రామ రైతులతో పాటు ఎ ఇ ఓలు కుమారీ, సురేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
19న కొమిరలో గ్రామదర్శిని కార్యక్రమం
గొలుగొండ, జూలై 17: ఈనెల 19వ తేదీన కొమిర గ్రామంలో గ్రామదర్శిని , గ్రామవికాసం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ తెలిపారు . మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమం మండలంలోని మొట్టమొదటి సారిగా కొమిర గ్రామంలో రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించనున్నారన్నారు. అలాగే ఈనెల 25వ తేదీన పాకలపాడు, 26న రావణాపల్లి, నాగాపురం, కొంకశింగి గ్రామాల్లో ఈకార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో గత నాలుగు సంవత్సరాల్లో దేశం పార్టీ ప్రవేశఫెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది, ప్రగతిపై గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకే గ్రామ వికాస కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమాలకు ఆయా గ్రామాల ప్రజలు, దేశంపార్టీ నాయకులు , ప్రజలు హాజరు కావాలని ఎంపీపీ లక్ష్మీనారాయణ కోరారు.