విశాఖ

అటవీ భూమలపై పట్టాలు సిద్ధం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 17: అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సి.సి.ఎల్.ఎ. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజదాని నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారులు, రెవిన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సాగు ఉన్న అటవీ భూములకు హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 8వ తేదిన అర్హులైన లబ్ధిదారులకు అటవీ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు హక్కు పత్రాలను పంపిణీ చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజి మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలోని 4 వేల 470 మంది లబ్ధిదారులకు 13 వేల 196 ఎకరాల అటవీ భూమిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అటవీ భూముల కింద హక్కు పత్రాలను పొందేందుకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే రూపొందించి హక్కు పత్రాలను సిద్ధం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అటవీ భూములపై పట్టాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పలు మండలాల తాహశీల్ధార్లు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మన్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ హేతుబద్ధీకరణ
ఐ.టి.డి.ఎ. పి.ఒ. బాలాజి
పాడేరు, జూలై 17: విశాఖ గిరిజన ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థను హేతుబద్ధీకరించి గిరిజనులకు నిత్యావసర వస్తువుల పంపిణీని పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి చెప్పారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో జి.సి.సి., పౌర సరఫరాలు, వెలుగు, ఉపాధి హామీ పథకం అధికారులకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు చేరువలో నిత్యావసర వస్తువుల పంపిణీని చేపట్టే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. లబ్ధిదారుల గ్రామాలకు కిలో మీటరు దూరంలో డి.ఆర్.డిపోలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం డి.ఆర్.డిపోలు గిరిజనులకు సుదూర ప్రాంతంలో ఉండడం వలన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని నివారించి గిరిజనుల చెంతకే డి.ఆర్.డిపోలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిపోలు గిరిజనులకు ఎంత దూరంలో ఉన్నాయనే అంశంపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా ప్రస్తుతం డి.ఆర్.డిపోలకు సరుకు రవాణాలో ఎదురౌతున్న ఇబ్బందులు, సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామాలకు సైతం నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు అవసరమైన డి.ఆర్.డిపోల ఏర్పాటుపై సమీక్షించిన ఆయన ఏజెన్సీలో నూతనంగా 81 డి.ఆర్.డిపోలను అదనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అనంతగిరి మండలంలో 6, అరకులోయలో 5, చింతపల్లిలో 3, డుంబ్రిగుడలో 9, గూడెంకొత్తవీధిలో 13, జి.మాడుగులలో 9, హకుంపేటలో 4, కొయ్యూరులో 8, ముంచంగిపుట్టులో 12, పాడేరులో 9, పెదబయలు మండలంలో 3 డిపోల వంతున అదనంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసే ఈ డిపో వలన ఏజెన్సీలోని దాదాపు రెండు వందల గ్రామాల గిరిజనులకు నిత్యావసర వస్తువులను వారికి చేరువై ప్రయోజనాత్మకంగా ఉంటుందని బాలాజి చెప్పారు. ఈ సమావేశంలో గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్లు మోహనరావు, పార్వతమ్మ, వెలుగు ఎ.పి.డి. నాగేశ్వరరావు, ఏజెన్సీలోని పదకొండు మండలాల ఎ.పి.ఎం.లు, ఉపాధి హామీ పథకం ఎ.పి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కండి
కామ్రెడ్లకు లోకనాధం పిలుపు
పాడేరు, జూలై 17: గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఉదృత పోరాటాలు సాగించేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్.జి.ఒ.ల సంఘం భవనంలో మంగళవారం నిర్వహించిన సి.పి.ఎం. గిరిజన ప్రాంత ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో అనేక సమస్యలు ఆదివాసులను చుట్టుముట్టాయని అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగిస్తున్నా ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. నానాటికి పెరుగుతున్న సమస్యలతో గిరిజనుల జీవనం అత్యంత దుర్భరంగా మారుతుందని, మన్యంలో వైద్యం మరింత దయనీయంగా ఉందని ఆయన అన్నారు. ఏజెన్సీలో ప్రబలిన డెంగ్యూ వలన ఈ ప్రాంతంలో భయానిక వాతావరణం నెలకొని ఉన్నట్టు గుర్తించామని ఆయన చెప్పారు. మన్యాన్ని ఇంతవరకు మలేరియా పట్టిపీడించగా ఈ సారి డెంగ్యూ కూడా దీనికి జత కలిసి ఈ ప్రాంత వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మన్యాన్ని వ్యాధులు చుట్టుముట్టి గిరిజనులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఏజెన్సీలోని ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కడా కూడా నిపుణులైన వైద్యులు లేకపోవడంతో గిరిజనులకు సరైన చికిత్సలు అందక అల్లాడుతున్నట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలో నిపుణులైన వైద్యులను నియమించడంలో ఘోరంగా విఫలం చెందిన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అర్థరహితమైన కుంటి సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తుందని ఆయన విమర్శించారు. ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత ఉన్నప్పటికీ దీనిని కూడా పరిష్కరించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతం మైనింగ్ మాఫీయాకు కేంద్ర బిందువుగా మారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే మైనింగ్ మాఫీయాను పెంచి పోషిస్తూ గిరిజనులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. హుకుంపేట మండలం గూడ గ్రామం వద్ద అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అక్రమంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీపై గిరిజనులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గిరిజనులకు ద్రోహం చేస్తుందని ఆయన ఆరోపించారు. గ్రామాలలో రక్షిత మంచినీటి సదుపాయాలు మృగ్యమయ్యాయని, ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన గిరిజన కూలీలకు కోట్లాది రూపాయలను చెల్లించకుండా బకాయి ఉంచారని, విద్యా సంవత్సరం ఆరంభమై నెల రోజులు పూర్తయినా ఇంతవరకు పాఠ్య, నోట్ పుస్తకాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని ఆయన అన్నారు. ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డి.ఎస్.సి.ని నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. గిరిజనులకు ఉన్నత విద్యావకాశాలను కల్పించే గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుతు మూతలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఇటువంటి ఎన్నో సమస్యలపై తమ పార్టీ ఉదృతమైన ఉద్యమానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసినట్టు ఆయన తెలిపారు. గిరిజన సమస్యలపై రానున్న రోజుల్లో సాగించే పోరుబాటకు కార్యకర్తలు సిద్ధం కావడమే కాకుండా గిరిజనులను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని లోకనాధం చెప్పారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. నాయకులు కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్స, వి.ఉమామహేశ్వరరావు, బి.సన్నిబాబు, బి.సి.హెచ్.పడాల్, పి.శాస్ర్తీబాబు, ఆర్.శంకరరావు, ఎల్.సుందరరావు, పాలికి లక్కు, ఏజెన్సీలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.