విశాఖపట్నం

క్యాంపస్ ఇంటర్వ్యూలలో మారుతున్న ప్రాధాన్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: క్యాంపస్ ఇంటర్వ్యూలలో కంపెనీల ప్రాధాన్యతలు మారుతున్నాయని గీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ అన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులలో పుస్తక పరిజ్ఞానం పాటు నూతన అంశాలపై అవగాహన, ఐటీ కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా గీతం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇంజనీరింగ్ విద్య తరువాత విద్యా ఉపాధి అవకాశాలు అనే అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా పనిచేయడం, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లుగా సేవలందించడం కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కంపెనీలు పరిగణలోకి తీసుకుంటాయని అన్నారు. భావ ప్రకటన, సేవాభావం, బృందానికి నాయకత్వం వహించే లక్షణాలను కంపెనీలు నిశితంగా పరిశీలిస్తాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి ప్రొఫెసర్ తమ్మిరెడ్డి, గీతం ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ విభాగం డైరక్టర్ కమాండర్ గురుమూర్తి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.