విశాఖపట్నం

వర్సిటీని సందర్శించిన ఐటీబిపి కమాండెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటిబిపి) 56వ బెటాలియన్ ఆంధ్రవిశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వచ్చింది. గురువారం ఐటిబిపి 56వ బెటాలియన్ కమాండెంట్ చంద్రమోహన్ మిశ్రా వర్సిటీ వీసీ ఆచార్య జీ.నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. అవసరమైన అవగాహన ఒప్పందాలపై చర్చించారు. ఐటిబిపి ఉద్యోగులు వర్సిటీలో కోర్సుల్లో చేరడానికి ఆసకిత చూపుతున్నారన్నారు. వారి విద్యా సంబంధ ఉన్నతికి అవసరమైన కోర్సులు అందించారన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్సిటీ ఇప్పటికే రక్షణ రంగాల ఉద్యోగులకు పీజీ, డిగ్రీ, డిప్లమో, పీహెచ్‌డి ప్రోగ్రాములు నిర్వహించడానికి ఎంఓయూలు చేసుకుందన్నారు. రక్షణ రంగాల ఉద్యోగులకు ఉపయుక్తంగా దూర విద్యలో యోగా డిప్లమో కోర్సును ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ఏయూ వీసీ నాగేశ్వరరావుకు ఐటిబిపి కమాండెంట్ చంద్రమోహన్‌మిశ్రా జ్ఞాపికను బహకరించారు. వీసీ నాగేశ్వరరావు చంద్రమోహన్ మిశ్రాను సత్కరించారు. కార్యక్రమంలో ఏయూ డిఫెన్స్ సంయుక్త విద్యా కార్యక్రమాల సమన్వయకర్త ఉజ్వల్‌కుమార్ ఘటక్, మీడియా రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ చల్లా రామకృష్ణ, ఐటిబిటి అధికారి ఎన్.బాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలే జీవకోటికి ప్రాణాధారం
విశాఖపట్నం, జూలై 19: మొక్కలే జీవకోటికి ప్రాణాధారం అని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. వర్సిటీలోని ఆసుపత్రి ఆవరణలో గురువారం డాక్టర్ మూర్తి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఏయూ ఇప్పటికే పచ్చదనంతో నిండుకుని ఉందన్నారు. నగరానికి కావాల్సిన ఆక్సిజన్‌ను అందించడంలో ఏయూ కీలక భూమిక పోషిస్తుందన్నారు. వర్సిటీలో అధునాతన సదుపాయాలతో నిర్మించిన ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్ ఆచార్య గాయత్రీదేవి, రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్‌లు ఆసుపత్రి అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్సిటీలోని ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.