విశాఖపట్నం

బ్యాంకింగ్ రంగం ప్రజల ఆదరణ చూరగొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: బ్యాంకింగ్ రంగం ప్రజల ఆదరణ చూరగొనాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఏయూ కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు వ్యాపారదోరణిని విడనాడాల్సి ఉందన్నారు. సామాన్యునికి సైతం సమర్ధ సేవలందించడం అవసరమన్నారు. నేడు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నాయని, వీటికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రాము మోహనరావు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం అనేక కీలక దశలను దాటిందన్నారు. సాంకేతికీకరణపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తాయన్నారు. ప్రజల అభిమానాన్ని ఆదరణ చూరగొనడం ఎంతో అవసరమన్నారు. బ్యాంకింగ్ సందిగ్ధతతో మ్యూచువల్ ఫండ్స్ రంగం పెరిగిందన్నారు. బ్యాంకింగ్ రంగం బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రాబ్యాంక్ డీజిఎం ఇ.కోటిరెడ్డి మాట్లాడుతూ ఆర్ధిక మాధ్యాన్ని సమర్ధంగా అధిగమించడానికి భారతీయ బ్యాంకింగ్ రంగం అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రైవేటు బ్యాంకులు ఆగమనం జరుగుతోందన్నారు. ప్రైవేటు వ్యక్తుల ప్రాబల్యం పెరగకుండా జాతీరుూకరణ ఉపకరించిందన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టతకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజిఎం బి.కుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం, ఆర్ధిక వ్యవస్థ సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీరుూకరణ లక్ష్యం చేకూరిందన్నారు. వినియోగదారుల ఆకాంక్షలు చేరుకునే ప్రయత్నం జరపాలన్నారు. యూనియన్ బ్యాంక్ డీజిఎం కెఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ సవాళ్లు, సంస్కరణలు నేడు సైతం కొనసాగుతున్నాయన్నారు. సాంకేతికత పెను సవాళ్ళుగా మారుతోంద్నారు. సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వరంగ బ్యాంకులతోనే సాధ్యపడిందన్నారు. ఆచార్య వి.హృషీకేతవరావు సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. విభాగాధిపతి ఆచార్య జి.సత్యనారాయణ సదస్సు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు, విద్యార్థులు, పరిశోధకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బ్యాంకింగ్ నిపుణులు ‘్భరతీయ బ్యాంకింగ్ రంగం-సవాళ్ళు, వ్యూహాలు’ అనే అంశంపై ప్రసంగించారు.