విశాఖపట్నం

డీసీసీబీలో పోస్టుల భర్తీకి 21న పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: జిల్లాకేంద్రసహకారబ్యాంకు (డీసీసీబీ)లో క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 21వ తేదీన పరీక్షలు జరుగనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. సహకార వ్యవస్థపై నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు రిజర్వేషన్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. కేవలం 61 క్లార్క్ పోస్టులకుగాను ఏకంగా 3486 ధరఖాస్తులు బ్యాంకుకు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించి అర్హులైన వారందరికీ పరీక్షకు అనుమతిస్తారు. ఈ విధంగా పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ ఇంటర్వ్యూలు ఉంటాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తారు. విశాఖ నగరంలో చినముషిడివాడ, షీలానగర్, శొంఠ్యాం తదితర ప్రాంతాల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విజయనగరం, కాకినాడ ప్రాంతాల్లోను కేంద్రాలను నిర్వహిస్తారు. రిజర్వుబ్యాంకు నిబంధనలు ప్రకారం ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసు (ఐబీపీఎస్) అనే ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీని తదుపరి ఎంపికైన అభ్యర్థులకు కొద్దిరోజులపాటు సహకార రంగంపై శిక్షణిస్తారు. తదుపరి కొత్తగా ఏర్పాటయ్యే డీసీసీబీ శాఖల్లో క్లర్క్‌లుగా నియమిస్తారు. గత రెండు దశాబ్ధాల కాలంలో ఈ విధంగా క్లర్క్ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి కానుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పదవీవిరమణ చేసినా, బదిలీలపై వెళ్ళిన వారి స్థానాలను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్దతిలోనే అదీ కొంతమందికి మాత్రమే అవకాశం లభించేది. ఈ విధంగా పనిచేసేవారంతా ఏళ్ళ తరబడి కొద్దిపాటి జీతానికే సేవలందించాల్సి వచ్చేది. సొసైటీల్లో అనుభవం కలిగి ఉండే వారికి పాలకవర్గం తీర్మానించిన తరువాతనే అవకాశం కల్పించేవారు. అయితే ఈ విధమైన నియామకాలపై బ్యాంకు యాజమాన్యం ఆరోపణలు ఎదుర్కోవడం, సిఫారసులకు తలగ్గొడం వంటి వాటికి శాశ్వతంగా స్వస్తిచెప్పడంతోపాటు నియామకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం కోసం ఈ బాధ్యతను పూర్తిగా ఐబిపిఎస్‌కు అప్పగించి చేతులు దులుపుకుంది. ఇపుడు ఈ సంస్థ ద్వారా ప్రతిభ, రిజర్వేషన్ ప్రాతిపదికనే పోస్టుల భర్తీని నిర్వహించనుంది. ఈ విధంగా చేరిన క్లర్క్‌లు సహకార వ్యవస్థ పటిష్టత, రైతులకు ప్రభుత్వ పథకాల అమలు చేయడం, ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరించి బ్యాంకు ఆర్ధిక పరిపుష్టికి తోడ్పడే విధంగా కొత్తగా వచ్చే గుమస్తాలు సేవలందించాల్సి ఉంటుంది.